AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiyaan Vikram: స్టార్ హీరో సింప్లిసిటీ.. అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన చియాన్ విక్రమ్.. వీడియో ఇదిగో

కోలీవుడ్ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. మలయళ ముద్దుగుమ్మలు మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ప్రధాన పాత్రలు పోషించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న తంగలాన్ థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది

Chiyaan Vikram: స్టార్ హీరో సింప్లిసిటీ.. అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన చియాన్ విక్రమ్.. వీడియో ఇదిగో
Chiyaan Vikram
Basha Shek
|

Updated on: Aug 28, 2024 | 11:27 AM

Share

కోలీవుడ్ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. మలయళ ముద్దుగుమ్మలు మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ప్రధాన పాత్రలు పోషించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న తంగలాన్ థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళంలో తంగలాన్ మూవీ రూ. 100 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. ఇక సూపర్ హిట్ టాక్ రావడంత నార్త్ లోనూ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 30న తంగలాన్ హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతుండడంతో మూవీ మేకర్స్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. తాజాగా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇందులో భాగంగా చిత్రయూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు చియాన్ విక్రమ్ తో సహా తంగలాన్ యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. అలాగే విక్రమ్ అభిమానులు కూడా భారీగా ఈ వేడుకలో పాల్గొన్నారు.

కాగా తంగలాన్ సక్సెస్ మీట్ కు సంప్రదాయమైన పంచెకట్టులో హాజరయ్యాడు విక్రమ్. ఈ సక్సెస్ మీట్ హాజరైన అభిమానులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన హీరో విక్రమ్ తన అభిమానులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ వంటకాలు వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు చియాన్ విక్రమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తంగలాన్ సక్సెస్ మీట్ లో అభిమానులకు భోజనాలు వడిస్తోన్న హీరో విక్రమ్.. వీడియో ఇదిగో..

తంలో ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పత్త పరంబరై’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్ తంగలాన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. పశుపతి, సంపత్ రామ్ కీలకపాత్రలలో కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.