AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్… సోషల్ మీడియాలో సరికొత్త క్రేజ్

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బన్నీ ముందుంటాడు అని చెప్పుకోవాలి.

Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్... సోషల్ మీడియాలో సరికొత్త క్రేజ్
Allu Arjun
Rajitha Chanti
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 31, 2021 | 12:21 PM

Share

Pushpa Hero Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బన్నీ ముందుంటాడు అని చెప్పుకోవాలి. అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‏గా ఉంటాడు బన్నీ. ట్విట్టర్, ఇన్‏స్టాలో అల్లు అర్జున్‏కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. బన్నీ చేసే ట్వీట్స్, ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక ఈ ఐకాన్ స్టార్ ఏదైనా కూడా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‏తో రికార్డులు సృష్టిస్తుంటాడు. తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ అందుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలోనే ఏ ఇతర హీరకు సాధ్యం కానీ రీతిలో ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు బన్నీ. తాజాగా ఈ హీరో తన ఇన్‏స్టాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్‏ను కలిగి ఉన్నారు. అంటే నెట్టింట్లో బన్నీకి దాదాపు 1 కోటి 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ రికార్డును అందుకున్న తొలి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు.

ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు తన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. బన్నీ ఇన్‎స్టా ఓపెన్ చేసి కేవలం నాలుగేళ్లు మాత్రమే అవుతుంది. ఈ నాలుగేళ్లలోనే బన్నీ ఈ ఘనత సాధించడం విశేషం. 2017 నవంబర్ నెలలో అల్లు అర్జున్ అధికారికంగా ఇన్‏స్టాలోకి వచ్చారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలే కాకుండా.. తన కూతురు, కుమారుడు అర్హ, అయాన్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు బన్నీ. తాజాగా బన్నీ 13 మిలియన్ మైలురాయిని అందుకుని రికార్డ్ సాధించారు. దీంతో అభిమానులు బన్నీకి విషెస్ చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా… రష్మిక హీరోయిన్‏గా నటిస్తోంది.

అల్లు అర్జున్ ఇన్‌స్టా పోస్ట్..

Also Read: టైటానిక్ హీరో ఆప్గాన్‌లో అగ్గి రాజేశాడు.. ఆ నిప్పు మళ్లీ ఇప్పుడు రాజుకుంటుంది.. ఏం చేశాడంటే..

Nikhil Siddhartha: మరోసారి ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో నిఖిల్.. అవేశాన్ని.. ఆక్రోశాన్ని అణిచివేయకుండా అంటూ..