Tollywood: డ్రగ్స్‌ కొనేందుకు సెలబ్రిటీలు డబ్బు ఎలా చెల్లించారు? డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో విచారణ మళ్లీ మొదలు

ఎంటరింగ్‌ ద ఈడీ. ఎస్, టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కీలక ఎపిసోడ్ ఇది. మాదకద్రవ్యాలు కొనేందుకు సెలబ్రిటీలు డబ్బు ఎలా చెల్లించారు? ఇదే అసలు ప్రశ్న

Tollywood: డ్రగ్స్‌ కొనేందుకు సెలబ్రిటీలు డబ్బు ఎలా చెల్లించారు? డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో విచారణ మళ్లీ మొదలు
Puri Jagan
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 31, 2021 | 7:37 AM

Tollywood Drugs Case: ఎంటరింగ్‌ ద ఈడీ. ఎస్, టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కీలక ఎపిసోడ్ ఇది. మాదకద్రవ్యాలు కొనేందుకు సెలబ్రిటీలు డబ్బు ఎలా చెల్లించారు? ఇదే అసలు ప్రశ్న. ఇవాళ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో విచారణ మొదలవుతుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎలాంటి క్వశ్చన్ పేపర్‌ సిద్ధం చేశారు? ఇది.. సిట్‌ అధికారుల క్వశ్చనైర్‌కు డిఫరెంట్‌గా ఉంటుందా? ఆల్రెడీ స్టేట్‌ లెవల్ అధికారులను ఫేస్ చేసిన డైరెక్టర్‌ పూరీ.. ఈడీని ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఇవన్నీ ఆసక్తిగా మారాయి.

ఇప్పటికే ముగ్గురు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసిన ED.. ఎక్సైజ్‌ అధికారుల నుంచి వివరాలు సేకరించింది. సిట్‌ చీఫ్‌ శ్రీనివాస్‌ ED ఆఫీస్‌కి వెళ్లి వివరాలు అందించారు. ఈపాటికి క్వశ్చన్‌ పేపర్‌ సిద్ధమైనట్టే చెప్పొచ్చు. రేపు పూరీ జగన్నాథ్‌ చెప్పే సమాధానాల ఆధారంగా.. తర్వాతి సెలబ్రిటీలకు ఈడీ క్వశ్చనైర్‌ సిద్ధంచేసే అవకాశమూ ఉంది. అటు, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఈడీ కష్టాలు తప్పలేదు. మనీ లాండరింగ్‌ కేసులో ఆమెను అధికారులు విచారించారు.

తీహార్‌ జైల్లో ఉన్న బడా కేటుగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌పై నమోదైన కేసులో జాక్వెలిన్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అన్నాడీఎంకే సింబల్‌ కేసులో అరెస్టయ్యాడు సుఖేశ్‌. చెన్నైలో ఆయన సన్నిహితురాలైన నటి లీనా పాల్‌ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. కోట్లాది నగదుతో పాటు 15 లగ్జరీ కార్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీహార్‌ జైల్ నుంచి 200 కోట్ల వసూళ్లకు పాల్పడినట్టు సుఖేశ్‌పై కేసు నమోదైంది.

Read also: సంతాన సాఫల్యానికి కొత్త జంటలు ఎందుకు దూరమవుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందా?