Abbas: హీరో అబ్బాస్ జీవితం ఎంతోమందికి స్పూర్తి.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.. ?
ప్రేమదేశం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అప్పట్లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొదట్లో ఇంజినీరింగ్ కెరీర్‌ను ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్న అబ్బాస్ గ్లామర్‌తో ఆకర్షితుడయ్యాడు. మోడలింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు.

90వ దశకంలో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో అబ్బాస్. ప్రేమదేశం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అప్పట్లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొదట్లో ఇంజినీరింగ్ కెరీర్‌ను ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్న అబ్బాస్ గ్లామర్‌తో ఆకర్షితుడయ్యాడు. మోడలింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. 90, 2000లలో తమిళ్ చిత్రసీమలో ఒక సంచలనం. స్టార్‌డమ్ సాధించినప్పటికీ, అబ్బాస్ జీవితం ఊహించని మలుపులు తిరిగింది. వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ప్లాపులను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి క్రమంగా తగ్గిపోయింది. అలాగే అంతగా అవకాశాలు కూడా రాలేదు. సినిమాలు తగ్గిపోవడంతో టైయిలెట్ యాడ్స్ చేశాడు. విదేశాలకు వెళ్లి ట్యాక్సిడ్రైవర్ ఉద్యోగం చేశాడు.
2015లో న్యూయార్క్ వెళ్లిన అబ్బాస్ బైక్ మెకానిక్ గా వర్క్ చేశాడు. టాక్సీ డ్రైవర్ గా, టాయిలెట్ క్లీనర్ ఉద్యోగాలు చేశాడు. సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన అబ్బా్స్.. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 1996లో కధీర్ దర్శకత్వం వహించిన ప్రేమదేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించి రాత్రికి రాత్రే స్టార్‌ని చేసింది. ఆ తర్వాత శ్వేత నాగు, పూచుడవ, మిన్నలే, ఆనందం, VIP, వంటి చిత్రాల్లో నటించాడు. అతను ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో స్క్రీన్ స్పేస్‌ను కూడా పంచుకున్నాడు.
చాలా కాలం తర్వాత ఇటీవలే మీడియా ముందుకు వచ్చాడు అబ్బా్స్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ మాట్లాడుతూ.. ““మొదట్లో ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన వచ్చినప్పటికీ, నా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను. అలాగే ఆర్థిక సమస్యలు వచ్చాయి. కొన్ని వ్యసనాలు వేటాడాయి. కొన్ని రోజులకు ఇండ్ట్రీలో పరిస్థితులు చూసి విసుగువచ్చి పూర్తిగా తప్పుకున్నాను. ఇక్కడ నా పనిని ఆస్వాదించలేకపోయాను ” అన్నారు. ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
