AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లి ఒడిలోని క్యూట్ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో హిట్ మూవీస్ చేసింది. అప్పట్లో వీరిద్దరిది హిట్ పెయిర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాల్లో అలరించిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా కనిపిస్తుంది. అమ్మ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ?..

Tollywood: తల్లి ఒడిలోని క్యూట్ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2024 | 9:32 AM

Share

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో హిట్ మూవీస్ చేసింది. అప్పట్లో వీరిద్దరిది హిట్ పెయిర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాల్లో అలరించిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా కనిపిస్తుంది. అమ్మ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ?.. తనే రాధికా శరత్ కుమార్. 80,90’s కాలంలో దక్షిణ భారత సినీ ప్రపంచంలో అత్యంత బిజీ హీరోయిన్లలో ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో అప్పట్లో అందరూ సూపర్ స్టార్ హీరోలతో నటించింది. రాధిక చిన్ననాటి చిత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పైన ఫోటోలో రాధికను ఎత్తుకున్న మహిళ ఆమె తల్లి గీత.

ప్రముఖ తమిళ నటి రాధిక రాధ, గీతల కుమార్తె. యుకెలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, రాధిక 1978లో ‘ఈస్ట్ పోగమ్ రైల్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. రాధిక వివిధ భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు. నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా కూడా రాధిక దృష్టిని ఆకర్షించింది. ‘మీండుమ్ ఒరు కథల్ కథై’ చిత్రానికి గానూ రాధికకు జాతీయ అవార్డు లభించింది. రాధిక టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించింది. రాధిక పలు టెలివిజన్ షోలలో యాంకర్‌గా కూడా కనిపించింది.

2001న ఫిబ్రవరి 4న తమిళ నటుడు శరత్ కుమార్ ను మూడో వివాహం చేసుకుంది రాధిక. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు, ర్యానే అనే కుమార్తె ఉన్నారు. కుమార్తె ర్యాన్ క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం రాధిక బిజేపీ తరపున ఎంపీ పదవికి పోటీ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.