AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Shankar: నాది అలాంటి క్యారెక్టర్ కాదు.. గౌరవాన్ని కాపాడుకోండి.. చోటా కె నాయుడిపై హరీష్ శంకర్ ఫైర్..

తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్. చోటా కె నాయుడితో కలిసి పనిచేసిన అనుభవం తనను బాధ పెట్టినా.. ఆయనకున్న అనుభవంతో చాలా విషయాలను నేర్చుకున్నానని.. అందుకే ఆయనంటే తనకు గౌరవమని.. దాన్ని నిలబెట్టుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ నెట్టింట వైరలవుతుంది.

Harish Shankar: నాది అలాంటి క్యారెక్టర్ కాదు.. గౌరవాన్ని కాపాడుకోండి.. చోటా కె నాయుడిపై హరీష్ శంకర్ ఫైర్..
Harish Shankar, Chota K Nai
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2024 | 8:55 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. అలాగే మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.. తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్. చోటా కె నాయుడితో కలిసి పనిచేసిన అనుభవం తనను బాధ పెట్టినా.. ఆయనకున్న అనుభవంతో చాలా విషయాలను నేర్చుకున్నానని.. అందుకే ఆయనంటే తనకు గౌరవమని.. దాన్ని నిలబెట్టుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ నెట్టింట వైరలవుతుంది.

గతంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చోటా కె నాయుడు పనిచేచశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. హరీష్ శంకర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామయ్య వస్తావయ్యా సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రతి పనికి తనకు అడ్డుపడేవాడని.. తన మాట పట్టించుకునేవాడు కాదని అన్నారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. దీంతో చోటా కె నాయుడి కామెంట్స్ పై ఫైర్ అవుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు హరీష్ శంకర్.

“రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చే దాదాపు పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో మీరు పది ఇంటర్వ్యూలు ఇస్తే.. నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చాను కావచ్చు.. కానీ ఎప్పుడూ ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు.. కానీ మీరు నా గురించి చాలాసార్లు అవమానించేలానే మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందా ఆ సినిమా చేస్తున్న సమయంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరా మెన్ తో షూటింగ్ చేద్దాం అనుకున్నాం. కానీ దిల్ రాజు గారు చెప్పడం వల్ల.. అలాగే గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ను తీసేస్తున్నాడని పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటారని భయంతో ఆలోచిస్తూనే మీతో సినిమా పూర్తి చేశాను. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. కానీ ఏరోజు ఆ నింద మీపై వేయలేదు. సినిమా హిట్ అవుతే నాది.. ప్లాప్ అయితే వేరేవాళ్లది అని చెప్పే క్యారెక్టర్ నాది కాదు. కానీ మీరు ఎదుటివారు అడిగినా అడకపోయినా నా గురించి ప్రస్తావన రాకపోయినా అవమానించేలా మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నాను. కానీ నా అన్నవాళ్లు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మీతో పని ఇబ్బంది కలిగినా.. మీ అనుభవం నుంచి కొన్ని నేర్చుకున్నాను. అందుకే మీరంటే నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. లేదు ఇంకా అలాగే మాట్లాడతా అంటే నేను ఎక్కడికైనా వస్తా డిబెట్ కు.. భవదీయుడు హరీశ్ శంకర్” అంటూ లేఖను పోస్ట్ చేశాడు హరీష్ శంకర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.