Actor Nani: గుండె బరువుగా ఉంది.. హీరో నాని ఎమోషనల్ పోస్ట్..
ఇందులో నాని జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమాలో మరోసారి నాన్న పాత్రలో జీవించేశాడు నాని. అంతకు ముందు నాని నాన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న సినిమా జెర్సీ. ఈ మూవీ నాని కెరీర్ లోని బిగ్గె్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో న్యాచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన సినీ ప్రయాణం.. అష్టా చెమ్మా సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత బ్యా్క్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. న్యాచురల్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ హీరో.. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో నాని జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమాలో మరోసారి నాన్న పాత్రలో జీవించేశాడు నాని. అంతకు ముందు నాని నాన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న సినిమా జెర్సీ. ఈ మూవీ నాని కెరీర్ లోని బిగ్గె్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు.
జెర్సీ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 2019లో ఏప్రిల్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని.. అనేక అవార్డ్స్ గెలుచుకుంది. తండ్రి,కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీనే ఈ సినిమాను రూపొందించారు. ఉద్యోగం కోల్పోయినా.. చెదిరిన కల కోసం పోరాడే ఓ తండ్రి ఆరాటమే ఈ సినిమా. ఇందులో నాని అర్జున్ పాత్రలో నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక నిన్నటితో ఈమూవీ రిలీజ్ అయ్యి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పలు చోట్ల సినిమాకు సంబంధించి స్పెషల్ షోస్ వేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక జెర్సీ సినిమాకు ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు నాని. జెర్సీ సినిమా స్పెషల్ షోస్ నుంచి వస్తున్న అభిమానం చూస్తే తనకి ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులను థాంక్స్ చెప్పాడు.జెర్సీ సినిమా రెస్పాన్స్ చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉందని బావోద్వేగ ట్వీట్ చేశారు.
Today it felt like Arjun came back from the skies to relive the journey and say farewell again. Heart is heavy and full ♥️#5YearsOfJersey #JerseySpecialShows
— Hi Nani (@NameisNani) April 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




