AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh-Priyadarshi: రెండేళ్లు ఖాళీగా ఉన్నావ్.. నభా నటేష్ పై ప్రియదర్శి పర్సనల్ అటాక్.. బాధపడిన హీరోయిన్..

గత మూడు రోజుల క్రితం డార్లింగ్ అని పిలవడం నేరమంటూ సోషల్ మీడియా వేదికగానే గొడవ పెట్టుకున్నారు. వీరి మధ్యలోకి హీరోయిన్ రీతూ వర్మను లాక్కొచ్చారు. దీంతో ఇదేదో సినిమా స్టంట్ అనుకున్నారంతా. ఇక అదే నిజమంటూ నిన్నటితో క్లారిటీ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబోలో డార్లింగ్ అనే సినిమా రాబోతుందంటూ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Nabha Natesh-Priyadarshi: రెండేళ్లు ఖాళీగా ఉన్నావ్.. నభా నటేష్ పై ప్రియదర్శి పర్సనల్ అటాక్.. బాధపడిన హీరోయిన్..
Priyadarshi, Nabha Natesh
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2024 | 8:14 AM

Share

ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్నాడు నటుడు ప్రియదర్శి. బలగం, హాయ్ నాన్న, ఓం భీమ్ భుష్, సేవ్ ది టైగర్స్ 2 వంటి హిట్స్ మూవీస్, వెబ్ సిరీస్‎లతో సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు డార్లింగ్ సినిమాతో మరోసారి హీరోగా అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి వై దిస్ కొలవరి ట్యాగ్ టైన్. ఇందులో హీరోయిన్ నభా నటేష్ మెయిన్ లీడ్ పోషిస్తుంది. అయితే వీరిద్దరూ తమ సినిమా ప్రమోషన్లను కాస్త కొత్తగా చేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం డార్లింగ్ అని పిలవడం నేరమంటూ సోషల్ మీడియా వేదికగానే గొడవ పెట్టుకున్నారు. వీరి మధ్యలోకి హీరోయిన్ రీతూ వర్మను లాక్కొచ్చారు. దీంతో ఇదేదో సినిమా స్టంట్ అనుకున్నారంతా. ఇక అదే నిజమంటూ నిన్నటితో క్లారిటీ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబోలో డార్లింగ్ అనే సినిమా రాబోతుందంటూ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. అక్కడ ఫన్నీగా స్కిట్ చేయాలనుకున్నారు. కానీ అది కాస్త సీరియస్ అయ్యింది.

డార్లింగ్ సినిమా భార్యభర్తల గొడవలు నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఇందులో నిత్యం గొడవపడే భార్యభర్తలుగా నటించనున్నారు. ఇక నిన్న గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో.. ప్రియదర్శి మాట్లాడుతూ.. భోజనం రెడీ అయ్యిందా ? అని అడగ్గా.. పక్కనే ఉన్న నభా ఎందుకిలా చేస్తున్నావు ? నేను రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చాను.. నీ లైన్స్ గుర్తు చేసుకుని మాట్లాడు అని ఆగ్రహించింది. దీనికి ప్రియదర్శి మాట్లాడుతూ.. రెండేళ్ల తర్వాత కనిపించావేమో.. నేను రెండు రోజులకే వచ్చేశాను. ఇదంతా నాకు కామన్ అని అనేశాడు. దీంతో నభా మాట్లాడుతూ.. అందుకే లైట్ తీసుకుంటున్నావా ? అడగ్గా.. లేదు సీరియస్ గానే ఉన్నానని కౌంటరిచ్చాడు దర్శి.

వరుసగా హిట్స్ అందుకుంటున్నావ్ కదా.. సక్సెస్ వస్తే ప్రొఫెషనలిజం చూపించాలి. యాటిట్యూడ్ కాదు అని నభా అనగా.. యాటిట్యూడ్ చూపిస్తున్నానా ?.. నువ్వు రావడంతో ఇస్మార్ట్ శంకర్, సోలో బతుకే సో బెటర్ అంటూ హిట్స్ కొట్టావు.. నీకే యాటిట్యూడ్.. రెండేళ్లలో కనీసం ఐదారు సినిమాలు చేశాను. నువ్వేం చేశావు ? ఎక్కడ కనిపించలేదు.. కనీసం కాఫీ తాగడానికి కూడా రాలేదు. ఎయిర్ పోర్టులో కూడా కనిపించలేదు. నువ్వు నన్ను అంటున్నావా ? అని ఫైరయ్యాడు.. దీంతో హర్ట్ అయిన నభా.. ప్రమోషన్ కోసం స్కిట్ చేస్తే నువ్వు పర్సనల్ అటాక్ చేశావు.. ఈ రెండేళ్లలో నాకేం జరిగిందో తెలుసా ?.. సర్జరీ అయ్యింది.. కోలుకున్నాక ఇలా.. అంటూ స్టేజ్ పై నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్రియదర్శి సైతం షాకయ్యాడు. అయితే ఇధి కూడా స్కిట్ కావచ్చని అంటున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.