రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు పడేది అప్పుడే.. ఒక్కొక్కరికి..
PM Kisan: పీఎం కిసాన్ 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ స్కీమ్ 22వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 2026 నాటికి మీ ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యే అవకాశం ఉంది. అయితే మీ e-KYC, భూమి రికార్డుల అప్‌డేట్ పూర్తి కాకపోతే డబ్బులు రావు. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దేశంలోని కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక ఆసరాగా నిలుస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం తదుపరి విడతకు రంగం సిద్ధమవుతోంది. 2026 కొత్త సంవత్సరం ప్రారంభమైన వేళ, రైతులందరూ ఇప్పుడు 22వ విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించనప్పటికీ, గత రికార్డులను పరిశీలిస్తే ప్రతి నాలుగు నెలలకు ఒక విడతను విడుదల చేస్తారు. దీని ప్రకారం.. 2026 ఫిబ్రవరి నెలలో 22వ విడత నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం విజయవంతంగా 21 వాయిదాలను పంపిణీ చేసింది.
పథకం నేపథ్యం – ప్రయోజనాలు
2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. దాదాపు 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ది చేకూరనుంది. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం రైతులకు సాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం
మీ ఖాతాలో డబ్బులు జమ కావాలంటే ఇవి పాటించండి
చాలా సందర్భాల్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు. 22వ విడత ఎటువంటి ఆటంకం లేకుండా అందాలంటే రైతులు ఈ క్రింది పనులు పూర్తి చేయాలి
e-KYC పూర్తి చేయడం: మీ PM కిసాన్ ఖాతాకు e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇది ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని సీఎస్సీ కేంద్రాల్లో చేయవచ్చు.
ఆధార్ సీడింగ్: మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.
భూమి రికార్డుల ధృవీకరణ : మీ భూమి వివరాలు పోర్టల్‌లో అప్‌డేట్ అయి ఉండాలి.
వివరాల తనిఖీ: PM కిసాన్ అధికారిక పోర్టల్‌లో మీ పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా సాగుతున్న ఈ పథకం గురించి ఏవైనా సందేహాలుంటే అధికారిక వెబ్‌సైట్ `pmkisan.gov.in` ను సందర్శించవచ్చు.
పెరుగుతున్న సాగు ఖర్చుల దృష్ట్యా, కేంద్రం అందించే ఈ రూ.2,000 సాయం రైతులకు గొప్ప ఊరటనిస్తుంది. ఫిబ్రవరి నాటికి నిధులు విడుదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో రైతులు తమ KYC, ఇతర ఫార్మాలిటీలను ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
