Tollywood: 2సార్లు విడాకులు.. 60 ఏళ్ల వయసులో మరో మహిళతో ప్రేమాయణం .. ఈ హీరో ఆస్తులు తెలిస్తే..
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు స్టార్ హీరో. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంటాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరో పేరు మారుమోగుతుంది. 60 ఏళ్ల వయసులో మూడోసారి ప్రేమలో పడిన హీరో. ఇంతకీ అతడు ఎవరంటే..

బాలీవుడ్ సినీరంగంలో ఖాన్ త్రయంలో ఈ హీరో ఒకరు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. రెండుసార్లు పెళ్లి చేసుకుని.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు 60ఏళ్ల వయసులో మూడో ప్రియురాలిని పరిచయం చేశాడు. సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తున్నాడు ఈ హీరో. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ఈ హీరో మరెవరో కాదండి.. ఆమిర్ ఖాన్. మార్చి 14న ఈ హీరో పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్, సెలబ్రెటీస్. కొన్నాళ్లుగా అతడు అంతగా సినిమాలు చేయడం లేదు.
ప్రస్తుతం అతడు నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ధనవంతులైన నటులలో ఆమిర్ ఖాన్ ఒకరు. గత 20 సంవత్సరాలుగా అతనికి ఎలాంటి జీతం అందడం లేదు. 1973లో విడుదలైన ‘యాదో కీ భారత్’ చిత్రంలో ఆయన బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అతను 90లలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
నివేదికల ప్రకారం ఆమిర్ ఖాన్ ఆస్తులు రూ.1862 కోట్లు. సినిమాలే బ్రాండ్స్ ప్రమోట్ చేయడం.. సినిమాల్లో నటించడంతోపాటు.. నిర్మాతగానూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఆమిర్ ఖాన్ తాను నటించే సినిమాలకు పారితోషికం తీసుకోవడం లేదు. ఆమిర్ ఖాన్ కు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. ‘అతనికి బెవర్లీ హిల్స్ మాన్షన్‌లో 75 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆయనకు దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఫామ్‌హౌస్ కూడా ఉంది. ఆమిర్ ఖాన్ దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్, BMW వంటి కార్లు ఉన్నాయి.

Aamir Khan Birthday
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..