Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Song : నీలాంబరిని వర్ణిస్తూ పాటలుపడుతున్న సిద్ద.. ”ఆచార్య” నుంచి అందమైన మెలోడీ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మెగాస్టార్ కెరీర్‌లో 153వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

Acharya Song : నీలాంబరిని వర్ణిస్తూ పాటలుపడుతున్న సిద్ద.. ''ఆచార్య'' నుంచి అందమైన మెలోడీ..
Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2021 | 3:56 AM

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మెగాస్టార్ కెరీర్‌లో 153వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి , చరణ్ కలిసి నటిస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ కల ఇప్పుడు ఆచార్య రూపంలో నిజం కాబోతుంది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆచార్య నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం చిరు అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి,చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. అలాగే చిరుకి జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే కనిపించనుంది. ఇప్పటికే  ఈసినిమానుంచి టీజర్ తోపాటు ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఆచార్య నుంచి సెకండ్ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

రామ్ చరణ్, పూజాహెగ్డే లపై ఈ పాటను చిత్రీకరించారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ప్రోమోను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఏ ప్రోమోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈపాటలో తన ప్రేయసి నీలాంబరిని తెగ పొగిడేశాడు సిద్ద. అందమైన లిరిక్స్ ఈపాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా అందంగా ఆలపించారు. ఈ పాట పై మీరు ఓ లుక్కేయండి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mehreen Pirzada Birthday: మంచులో కడిగిన ముత్యంలాంటి ముద్దుగుమ్మ మెహ్రీన్..

Allu Arjun’s Pushpa : సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా.. ‘పుష్ప’ సినిమాలో ఏకంగా వేయిమంది..

Dil Raju: రామ్ చరణ్- శంకర్ సినిమాకోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!!