Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్ మధ్య బిగ్ ఫైట్.. ఎగ్జైట్‌‌మెంట్ కాస్త ఆపుకో అంటూ ఆమె పై కౌంటర్ వేసిన సిరి..

బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్ మధ్య బిగ్ ఫైట్.. ఎగ్జైట్‌‌మెంట్ కాస్త ఆపుకో అంటూ ఆమె పై కౌంటర్ వేసిన సిరి..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2021 | 11:50 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హౌస్ మొత్తం గందరగోళంగా ఉంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, మాటల యుద్దాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎవరితో గొడవపడతారో కూడా తెలియడంలేదు. ఇక బిగ్ బాస్ ఇస్తున్న చిత్ర విచిత్ర టాస్కులు అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతున్నాయి. ఈక్రమంలో బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారానికి ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ చిన్నపాటి యుద్ధంలా సాగుతోంది. ఈ టాస్క్‌లో ఇప్పటికే శ్రీరామ్, రవి, ప్రియాంక, ఆనీ మాస్టర్ తమ తమ టీమ్‌లను గెలిపించుకున్నారు. అయితే ఈ టాస్క్ సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సిరి, షణ్ముఖ్ మధ్య ఫైట్ జరిగింది. షన్ను పై సిరి అలిగింది. ఆతర్వాత సారీ చెప్పి కూల్ చేశాడు షన్ను. మరుసటి రోజు మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. షన్ను సిరిని ఇదే నీ క్యారెక్టర్ అంటూ అవమానించాడుదాంతో ఆమె హర్ట్ అయ్యింది.

ఇక్కడ ఉన్నవాళ్లు అందరు ఫేక్. షన్నుని కూడా ఫేక్ అనేసింది. అందరు సపోర్ట్ చేస్తూ ఆడుతుంటే నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ విచిత్రమైన టాస్క్ ఇచ్చాడు. ఒకరితో ఒకరు తలపడాలని.. రెండు ఫ్లాట్ ఫార్మ్ పై నించొని ఒకరిని ఒకరు కిందికి తోసేయాలని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ముందుగా సన్నీ షణ్ముఖ్ తలపడ్డారు. ఆతర్వాత విశ్వ- మానస్ పోటీ పడ్డారు. అయితే విశ్వ ఆవేశంతో మానస్‌ను నెట్టబోయి అతనే కిందికి దిగిపోయాడు. దాంతో మానస్ గెలిచాడు. అయితే మానస్ గెలిచిన వెంటనే ప్రియాంక మానస్ అంటూ అరిచింది. వెంటనే పక్కనే ఉన్న సిరి ‘నీ ఎగ్జైట్‌‌మెంట్ కాస్త ఆపుకో అంటూ కౌంటర్ వేసింది. ఆ తర్వాత సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్ కంటిన్యూ అయ్యింది. ఈ టాస్క్ లో గెలవడం కోసం రెండు టీమ్ లు పోటీ పడాయి. ఒకరిని ఒకరు తోసుకుంటూ నానా హంగామా చేశారు. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు అన్నది నేటి ఎపిసోడ్ లో తేలనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నటుడు రాజేంద్ర ప్రసాద్..

Jacqueline Fernandez: ఒకే ఫ్రేమ్‌లో శ్రీలంక ముద్దుగుమ్మలు.. ఆకట్టుకుంటోన్న యొహానీ, జాక్వెలిన్‌ స్టెప్పులు..

Acharya Song : నీలాంబరిని వర్ణిస్తూ పాటలుపడుతున్న సిద్ద.. ”ఆచార్య” నుంచి అందమైన మెలోడీ..