Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez: ఒకే ఫ్రేమ్‌లో శ్రీలంక ముద్దుగుమ్మలు.. ఆకట్టుకుంటోన్న యొహానీ, జాక్వెలిన్‌ స్టెప్పులు..

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ తమిళ అందం. 'సాహో' సినిమాలో ప్రభాస్‌తో కాలు కదిపిన...

Jacqueline Fernandez: ఒకే ఫ్రేమ్‌లో శ్రీలంక ముద్దుగుమ్మలు.. ఆకట్టుకుంటోన్న యొహానీ, జాక్వెలిన్‌ స్టెప్పులు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 05, 2021 | 11:25 AM

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ తమిళ అందం. ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌తో కాలు కదిపిన ఈ భామ ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటించనుంది. ఇక ఒకే ఒక్క పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది యొహానీ డిసిల్వా. ఆమె ఆలపించిన ‘మణికె మగే హితే’ సాంగ్‌ విడుదలై రెండు రెండు నెలలైనా ఇప్పటికీ ట్రెండింగ్‌లో నడుస్తోంది. ఇలా తమ ట్యాలెంట్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ శ్రీలంక ముద్దుగుమ్మలు ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. ఇద్దరూ కలిసి ‘మణికె మగే హితే’ పాటకు సరదాగా కాలు కదిపారు.

‘మీరు శ్రీలంకలో ఉన్నట్లయితే యొహానీని కలవండి’ అంటూ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది జాక్వెలిన్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తోన్న యొహానీ ఇటీవల సల్మాన్‌ఖాన్‌తో కలిసి బిగ్‌బాస్‌ హౌస్‌లో సందడి చేసింది. ఇక అజయ్‌ దేవ్‌గణ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోన్న ‘థ్యాంక్యూ గాడ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందీ ర్యాప్‌సింగర్‌. ఇక జాక్వెలిన్‌ విషయానికొస్తే.. ‘బచ్చన్‌ పాండే’, ‘ఎటాక్‌’, ‘రామ్‌సేతు’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read:

Acharya Song : నీలాంబరిని వర్ణిస్తూ పాటలుపడుతున్న సిద్ద.. ”ఆచార్య” నుంచి అందమైన మెలోడీ..

Sunny Leone: సరికొత్త వ్యాపారంలోకి సన్నీలియోన్‌.. ఈ బిజినెస్‌ చేస్తున్న మొదటి భారతీయ నటి ఆమెనే..

బాలయ్య సరసన మాస్ రాజా హీరోయిన్.. నట సింహం నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ..