Sunny Leone: సరికొత్త వ్యాపారంలోకి సన్నీలియోన్‌.. ఈ బిజినెస్‌ చేస్తున్న మొదటి భారతీయ నటి ఆమెనే..

క్రిప్టో కరెన్సీని ప్రోత్సహించడంలో భాగంగా ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, సల్మాన్‌ ఖాన్ వంటి ప్రముఖ నటులు ఎన్ఎఫ్‌టీ (Non fungible token) వ్యాపారంలోకి అడుగుపెట్టిన

Sunny Leone: సరికొత్త వ్యాపారంలోకి సన్నీలియోన్‌.. ఈ బిజినెస్‌ చేస్తున్న మొదటి భారతీయ నటి ఆమెనే..
Follow us
Basha Shek

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 05, 2021 | 10:06 AM

క్రిప్టో కరెన్సీని ప్రోత్సహించడంలో భాగంగా ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, సల్మాన్‌ ఖాన్ వంటి ప్రముఖ నటులు ఎన్ఎఫ్‌టీ (Non fungible token) వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎఫ్‌టీ అనేది ఓ డిజిటల్‌ బిజినెస్‌. ఇందులో భాగంగా సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, సినిమాలు, ప్రత్యేక ఫొటోలు, వీడియోలను డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి వేలంలో విక్రయిస్తారు. ఇదంతా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా జరుగుతుంది. ఈ డిజిటల్‌ ఆస్తులను వేలం ద్వారా ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌టీలను కొన్నవారు తిరిగి వాటిని మళ్లీ వేలం వేసుకోవచ్చు. అయితే ఇలా వేలం జరిగినప్పుడల్లా వేలం మొత్తంలో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియేటర్లకు వాటాగా వెళుతుంది.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్‌ ఈ ఎన్‌ఎఫ్‌టీ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. తద్వారా ఈ వ్యాపారంలో అడుగుపెట్టిన మొదటి భారతీయ నటిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ సందర్భంగా ‘మిస్‌ ఫిట్జ్‌’ పేరుతో తన ఎన్‌ఎఫ్‌టీ వివరాలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తోంది. ‘ మిస్‌ ఫిట్జ్‌ను కలవండి. ఆమెకు గులాబీ రంగు అంటే ఎంతో ఇష్టం. ట్యాటూలు వేయించుకున్నా అబ్బాయిలన్నా ఇష్టమే. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నారు. సన్నీ లియోన్‌ ఎన్‌ఎఫ్‌టీలు సిద్ధంగా ఉన్నాయి ‘ అని సన్నీ పేర్కొంది.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

Also Read:

బాలయ్య సరసన మాస్ రాజా హీరోయిన్.. నట సింహం నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ..

Agent Movie : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ ఇచ్చిన జోష్.. శరవేగంగా “ఏజెంట్” ను పూర్తి చేస్తున్న అఖిల్..

Agent Movie : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ ఇచ్చిన జోష్.. శరవేగంగా “ఏజెంట్” ను పూర్తి చేస్తున్న అఖిల్..