Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నటుడు రాజేంద్ర ప్రసాద్..

Puneeth Raj Kumar: శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో కన్నడ సినీ ఇండస్ట్రీ విషన్నవదనంలో

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నటుడు రాజేంద్ర ప్రసాద్..
Rajendra Prasad
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 05, 2021 | 11:46 AM

Puneeth Raj Kumar: శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో కన్నడ సినీ ఇండస్ట్రీ విషన్నవదనంలో మునిగిపోయింది. అద్భుతమైన నటనతో పాటు.. విశేష దానధర్మాలతో మహోన్నత వ్యక్తిగా కీర్తించబడిన పునీత్ మరణ వార్తను అభిమానులు, సినీ ప్రేమికులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే ఎంతో పేరుసంపాదించుకున్న పునీత్ హఠాత్మరణంతో టాలీవుడ్ లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పునీత్ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఆయన మరణంతో టాలీవుడ్ సెలబ్రెటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ, రానా, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, అలీ ఇలా పలువురు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ సైతం పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ పార్థీవదేహాన్ని చూడలేకపోయిన ఆయన.. తాజాగా పునీత్ ఇంటికి వెళ్లారు. బెంగుళూరులోని సదాశివనగర్‌లోగల పునీత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇంట్లో పునీత్ చిత్రపటానికి నమస్కరించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులందరితో కాసేపు మాట్లాడి ఓదార్చారు. పునీత్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సందర్భంలో రాజేంద్ర ప్రస్తాద్ భావోద్వేగానికి గురయ్యారు.

ఇటీవలే హీరో నాగార్జున, రామ్ చరణ్ లు కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. పునీత్ లేని లోటు పూడ్చలేనిదంటూ నాగార్జున, రామ్ చరణ్ అన్నారు. సొంత కుటుంబ సభ్యులు దూరమైనట్లుగా ఉందని, ఆయన చనిపోయారంటే తాను నమ్మలేకపోతున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు.

Also read:

Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..

Jacqueline Fernandez: ఒకే ఫ్రేమ్‌లో శ్రీలంక ముద్దుగుమ్మలు.. ఆకట్టుకుంటోన్న యొహానీ, జాక్వెలిన్‌ స్టెప్పులు..

Acharya Song : నీలాంబరిని వర్ణిస్తూ పాటలుపడుతున్న సిద్ద.. ”ఆచార్య” నుంచి అందమైన మెలోడీ..