Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: గుత్తా జ్వాల కుమార్తెకు నామకరణం చేసిన ఆమిర్‌ఖాన్‌.. ఏం పేరు పెట్టాడో తెలుసా?

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ లది ప్రేమ వివాహం. 2021 ఏప్రిల్ 22న వీరి వివాహ వేడుక జరిగింది. సరిగ్గా వారి మూడో పెళ్లి రోజున, అంటే ఈ ఏడాది ఏప్రిల్ 22న వీరికి కుమార్తె జన్మించడం విశేషం. తాజాగా ఆ పాపకు నామకరణ మహోత్సవం నిర్వహించారు.

Aamir Khan: గుత్తా జ్వాల కుమార్తెకు నామకరణం చేసిన ఆమిర్‌ఖాన్‌.. ఏం పేరు పెట్టాడో తెలుసా?
Aamir Khan, Gutta Jwala
Basha Shek
|

Updated on: Jul 07, 2025 | 8:47 AM

Share

బ్యాడ్మింటన్‌ స్టార్ గుత్తా జ్వాల , కోలీవుడ్ హీర విష్ణు విశాల్‌ ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ లో గుత్తా జ్వాల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ గారాల పట్టి నామకరణ మహోత్సవం నిర్వహించారు గుత్తా జ్వాల దంపతులు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ ఖాన్ కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. ఆయనే గుత్తా జ్వాల కూతురికి పేరు పెట్టాడు. ఈ విషయాన్ని హీరో విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆమిర్ తో కలిసి తన కుటుంబం దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ.. ‘మా బేబీకి పేరు పెట్టడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆమిర్‌ఖాన్‌ సార్ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆమిర్‌ సర్‌తో మా ప్రయాణం అద్భుతం’ అని విష్ణు పేర్కొన్నాడు. ఇంతకు ఆమిర్ ఖాన్ గుత్తా జ్వాల కూతురికి ఏం పేరు పెట్టాడో తెలుసా? మిరా. దీని అర్ధాన్ని కూడా విష్ణు విశాల్ తన పోస్టులో వెల్లడించాడు. మిరా అంటే శాంతి, షరతుల్లేని ప్రేమ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ, క్రీడా ప్రముఖులతో పాటు సినీ, క్రీడా అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టుపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. అలాగే పాపకు బ్యూటిఫుల్ నేమ్ పెట్టారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌ కుటుంబంతో ఆమిర్‌ ఖాన్ మంచి అనుబంధం ఉంది. గతంలో.. తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్‌.. చెన్నైలోని విష్ణు విశాల్‌ ఇంట్లో నే ఉన్నాడు. ఇక ‘సితారే జమీన్‌ పర్‌’ విజయోత్సాహంలో ఉన్న ఆమిర్‌ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. కన్హా శాంతివనాన్ని (నందిగామ) శనివారం సందర్శించిన ఆయన ఆదివారం విష్ణు విశాల్‌ ఇంటికి వచ్చారు. కాగా ఎఫ్ఐఆర్, లాల్ సలామ్ సినిమాలతోవిష్ణు విశాల్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ఇక రాచసన్ (తెలుగులో రాక్షసుడు) సినిమాతో కోలీవుడ్ లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

ఇవి కూడా చదవండి

గుత్తా జ్వాల కూతురి నామకరణ మహోత్సవంలో ఆమిర్ ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.