AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan : ఎయిర్ పోర్టులో శ్రుతి హాసన్‏ను వెంబడించిన ఆగంతకుడు.. భయంతో పరుగులు పెట్టిన హీరోయిన్..

ఇటీవల దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది శ్రుతి. ఈ వేదికపై అవార్డ్ అందుకుంది. ఇక సైమా వేడుకల అనంతరం.. మంగళవారం తిరిగి ముంబై చేరుకుంది. అయితే ముంబై ఎయిర్ పోర్టులో శ్రుతికి చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని చేసిన పనికి భయంతో పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Shruti Haasan : ఎయిర్ పోర్టులో శ్రుతి హాసన్‏ను వెంబడించిన ఆగంతకుడు.. భయంతో పరుగులు పెట్టిన హీరోయిన్..
Shruti Haasan
Rajitha Chanti
|

Updated on: Sep 19, 2023 | 7:25 PM

Share

శ్రుతి హాసన్ చేతిలో ప్రస్తుతం సలార్ చిత్రం మాత్రమే ఉంది. ఇటు సౌత్ ఇండస్ట్రీలో మరోసారి ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికతో, చెల్లెలు అక్షరతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటోస్ పంచుకుంటుంది. ఇటీవల దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది శ్రుతి. ఈ వేదికపై అవార్డ్ అందుకుంది. ఇక సైమా వేడుకల అనంతరం.. మంగళవారం తిరిగి ముంబై చేరుకుంది. అయితే ముంబై ఎయిర్ పోర్టులో శ్రుతికి చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని చేసిన పనికి భయంతో పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ముంబై ఎయిర్ పోర్టు లోపలి నుంచి పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కారు దగ్గరకు వస్తున్న శ్రుతిని ఓ వ్యక్తి అనుసరించాడు. శ్రుతి పక్కనే నడుస్తూ ఆమెను భయానికి గురిచేశాడు. అతడిని గమనించిన శ్రుతి ఆగి ఎవరు అని ప్రశ్నించడంతో పక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరికాసేపటికి అదే వ్యక్తి శ్రుతి వెనకే వచ్చాడు. ఆమె కారు ఎక్కే వరకు శ్రుతిని ఫాలో అవుతూనే ఉన్నాడు. ప్రతిసారి అతడి నుంచి దూరంగా వెళ్ళేందుకు ప్రయత్నించింది శ్రుతి. ఆ వ్యక్తి చేష్టలకు భయపడిపోయి వెంటనే కారు ఎక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

శ్రుతి హాసన్ చివరిసారిగా వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి చిత్రాలలో కనిపించింది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. ఈ మూవీ తర్వాత ఆమె సలార్ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆద్య పాత్రలో కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
ఇంట్లో డమరుకం ఉంచుతున్నారా? ఈ ఒక్క దిశలో పెడితే ప్రతికూల శక్తి..
ఇంట్లో డమరుకం ఉంచుతున్నారా? ఈ ఒక్క దిశలో పెడితే ప్రతికూల శక్తి..