Rishab Shetty: సైమాలో ‘కాంతారా’కు అవార్డుల పంట.. పునీత్‌కు అంకితమిచ్చిన రిషబ్‌.. ఫ్యాన్స్‌ ప్రశంసలు

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన కాంతారా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ పాన్‌ ఇండియా సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు సొంతం చేసుకుంది. థియేటర్లలో కాసుల పంట పండించిన కాంతారా ఇప్పుడు అవార్డుల పంట పండిస్తోంది. ఇటీవల దుబాయ్‌ వేదికగా జరిగిన సైమా 2023 పురస్కారాల్లో కాంతారా సినిమాకు ఏకంగా 10 విభాగాల్లో అవార్డులు రావడం విశేషం.

Rishab Shetty: సైమాలో 'కాంతారా'కు అవార్డుల పంట.. పునీత్‌కు అంకితమిచ్చిన రిషబ్‌.. ఫ్యాన్స్‌ ప్రశంసలు
Rishab Shetty, Puneeth Rajkumar
Follow us
Basha Shek

|

Updated on: Sep 19, 2023 | 7:15 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన కాంతారా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ పాన్‌ ఇండియా సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు సొంతం చేసుకుంది. థియేటర్లలో కాసుల పంట పండించిన కాంతారా ఇప్పుడు అవార్డుల పంట పండిస్తోంది. ఇటీవల దుబాయ్‌ వేదికగా జరిగిన సైమా 2023 పురస్కారాల్లో కాంతారా సినిమాకు ఏకంగా 10 విభాగాల్లో అవార్డులు రావడం విశేషం. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ విలన్‌, ఉత్తమ గేయ రచయిత.. తదితర విభాగాల్లో ఈ పాన్‌ ఇండియా సినిమాకు పురస్కారాలు వచ్చాయి. దీంతో కాంతారా సినిమా ఫుల్‌ జోష్‌లో ఉంది. తాజాగా ఈ అవార్డుల గురించి సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు రిషబ్‌. సైమా అవార్డులు అందుకున్న ఫొటోలను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్‌ చేసిన ఆయన వీటిని దైవ నృత్య కళాకారులు, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ అలాగే కన్నడిగులకు వీటిని అంకితమిస్తున్నట్లు తెలిపారు. ‘మా కాంతారా సినిమా మొత్తం 10 విభాగాల్లో సైమా అవార్డులు గెల్చుకుంది. ప్రజల ఆదరాభిమానాలే కాంతారా విజయానికి ప్రధాన కారణం. ఈ విజయం అంతా దైవ నృత్యకారులు, అప్పు సార్, కన్నడిగులకు అంకితమిస్తున్నాను. ‘‘కాంతారా’’ ఈ రోజు వరకు అపూర్వమైన ప్రేమను పొందుతూనే ఉంది. 10 సైమా అవార్డులను అందుకోవడం ఒక అద్భుతమైన గౌరవం. మరింత గొప్ప బలం, ప్రేమ, మరియు ఆశీర్వాదాలతో, కాంతారా 2వ భాగం కోసం ప్రయాణాన్ని ప్రారంభిద్దాం’ అని ఇందులో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు రిషబ్.

ప్రస్తుతం రిషబ్‌ శెట్టి పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా తన అవార్డులను పునీత్‌ రాజ్‌కుమార్‌కు అంకితమివ్వడంతో అందరి మనసులు గెల్చుకున్నాడు రిషబ్‌. తుళునాడు సంస్కృతి, ఆచార వ్యవహారాలను ‘కాంతారా’ సినిమాలో చక్కగా చూపించారు రిషబ్‌ శెట్టి. సెప్టెంబర్ 30, 2022న విడుదలైన ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు పలువురి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో రిషబ్ శెట్టికి నేషనల్‌ వైడ్‌గాపాపులారిటీ వచ్చింది. అలాగే ‘హోంబాలే ఫిల్మ్స్’ సంస్థకు భారీ లాభాలు వచ్చాయి. ఇప్పుడు ‘కాంతారా2’ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్

సైమా-2023 అవార్డుల్లో కాంతార గెల్చుకున్న అవార్డులివే..

ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్): రిషబ్ శెట్టి పాత్ బ్రేకింగ్ స్టోరీ: రిషబ్ శెట్టి ఉత్తమ నటి (క్రిటిక్స్): సప్తమి గౌడ ఉత్తమ విలన్: అచ్యుత్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకత్వం: అజనీష్ బి. లోకనాథ్ ఉత్తమ గాయకుడు: విజయ్ ప్రకాష్ ఉత్తమ హాస్య నటుడు: ప్రకాష్ తుమ్మినాడు ఉత్తమ సాహిత్యం: ప్రమోద్ మరవంటే స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు: ముఖేష్ లక్ష్మణ్

అప్పూ సార్ కు అంకితం..

View this post on Instagram

A post shared by SIIMA (@siimawards)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.