Devil Movie: ‘మాయే చేసి మెల్లగా మది దొచేసిందే సిన్నగా’.. సిద్ శ్రీరామ్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్..
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే ఈసారి మరో విభిన్నమైన కథతో అడియన్స్ ముందుకు రాబోతున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అని ట్యాగ్ లైన్ పెట్టడంతో మరింత ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్‌తో హైప్ క్రియేట్ చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా డెవిల్. బింబిసార, అమిగోస్ తర్వాత ఆయన నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటి పెంచేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే ఈసారి మరో విభిన్నమైన కథతో అడియన్స్ ముందుకు రాబోతున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అని ట్యాగ్ లైన్ పెట్టడంతో మరింత ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్‌తో హైప్ క్రియేట్ చేశారు.
ఈ సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. పట్టుచీరలో మరింత అందంగా కనిపించింది. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘మాయే చేసి మెల్లగా మది దొచేసిందే సిన్నగా’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేస్తోంది. ఇప్పటివరక్ సిద్ పాడిన పాటలన్ని సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సాంగ్ కూడా హిట్ కావడం ఖాయమని తెలుస్తోంది.
A melody that lingers in your soul! 😍
Here’s the soothing #MaayeChesi from #Devil ❤️
– https://t.co/H0ZkkKAoZI#DevilMusical
🎙️ @sidsriram ✍🏻 #SatyaRVV 🎵 @rameemusic#Devil – The British Secret Agent డెవిల్ – डेविल – டெவில் – ಡೆವಿಲ್ – ഡെവിൽ#DevilonNov24th… pic.twitter.com/aH2kt1ZcS4
— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 19, 2023
స్వాతంత్ర్యం రాకముందు బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. తాజాగా విడుదలైన పాటలో హీరోహీరోయిన్ కస్ట్యూమ్స్, మేకప్ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేయనున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
👸Prepare to be spellbound by the alluring #DevilsAngel 😈😇, @iamsamyuktha_ !
Excited to introduce the talented and beautiful Samyuktha as Nyshadha.
Sending warm birthday wishes to the incredible! May your special day be filled with love, happiness, and countless blessings.… pic.twitter.com/MWPFZ4A8qA
— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.