7:11 PM Trailer: ఆధ్యంతం ఆసక్తికరంగా 7:11 PM ట్రైలర్.. ఆ ఒక్క రాత్రిలో అసలేం జరిగింది ?..
ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమానే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. అదే 7.11 PM సినిమా. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతుంది. ఇందులో సాహస్, దీపికా ప్రధాన పాత్రలలో నటించారు. ఇద్దరూ కొత్తవారే. చైతు మాదాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ పై నరేన్ యనమదల మాధురి రావిపాటి వాణి కన్నెగంటి నిర్మించారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. కొత్త నటీనటులతో తెరకెక్కించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమానే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. అదే 7.11 PM సినిమా. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతుంది. ఇందులో సాహస్, దీపికా ప్రధాన పాత్రలలో నటించారు. ఇద్దరూ కొత్తవారే. చైతు మాదాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ పై నరేన్ యనమదల మాధురి రావిపాటి వాణి కన్నెగంటి నిర్మించారు. ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. దీనిని డైరెక్టర్ హరీశ్ శంకర్ రిలీజ్ చేస్తూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఊరు హంసల దీవి.. రెండు గ్రహాలు మూడు వేర్వేరు కాలాల మధ్య జరిగిన కథ అని తెలుస్తోంది. భారత దేశంలోని హంసలదీవి అనే ప్రాంతంలో బస్సు ఎక్కిన ఓ కుర్రాడు ఆస్ట్రేలియాలోని బీచ్ లో స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అతడు అక్కడికి ఎలా వెళ్లాడు ?.. తిరిగి తన ఊరుకు వెళ్లాలనుకున్న క్రమంలోనే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..
ఫైట్లు, ఛేజింగ్లు మర్డర్స్ అన్నింటిని కలిపి చూపిస్తూ ట్రైలర్ ముగించారు. ఒక్కరాత్రిలో ఇండియా నుంచి ఆస్ట్రేలియా ఎలా వెళ్లాడు ?.. అసలు ఆ బస్సులో ఏం జరిగింది?.. మధ్యలో టైమ్ ట్రావెల్ ఎందుకు వచ్చింది ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక ట్రైలర్ విజువల్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ కూడా ప్రతి సింగిల్ ఫ్రేమ్ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.