Rudrangi Pre Release Event: జగపతి బాబు ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా ఎవరంటే..

విలక్షణ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం రుద్రంగి. ఇందులో మమతా మోహన్ దాస్, విమల రామన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తుండగా.. శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన రుద్రంగి ట్రైలర్ ఆకట్టుకుంది.

Rudrangi Pre Release Event: జగపతి బాబు 'రుద్రంగి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా ఎవరంటే..
Rudrangi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2023 | 7:42 PM

విలక్షణ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం రుద్రంగి. ఇందులో మమతా మోహన్ దాస్, విమల రామన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తుండగా.. శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన రుద్రంగి ట్రైలర్ ఆకట్టుకుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. ఇందులో దొర పాత్రలో జగపతి బాబు నటించారు. అతని క్రూరమైన పరిపాలన.. దౌర్జన్యాలు ప్రజలను పేదరికంలో.. ఆకలిలో ఎలా పడేసాయి ?.. ఆ తర్వాత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎలాంటి తిరుగుబాటు జరిగిందనేది చిత్రం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ వేడకకు నందమూరి బాలకృష్ణ, హరిశ్ రావు ముఖ్య అతిథులుగా వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.