AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soundarya: సౌందర్య చివరి మాటలు.. చనిపోయే ముందు తన మేడకోడలితో ఏమన్నారంటే..

చక్కటి చీరకట్టులో.. నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలా నటించి తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయింది.. గ్లామర్ షో చేయాకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సమయంలోనే అనుకోని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Soundarya: సౌందర్య చివరి మాటలు.. చనిపోయే ముందు తన మేడకోడలితో ఏమన్నారంటే..
Soundarya
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2023 | 4:48 PM

Share

తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ఆమెకు మాత్రమే సొంతం. తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన రూపం ఆమెది. మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సౌందర్య. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. చక్కటి చీరకట్టులో.. నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలా నటించి తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయింది.. గ్లామర్ షో చేయాకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సమయంలోనే అనుకోని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఆమె రూపం అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగానే ఉండిపోయింది. అలాగే సౌందర్యకు సంబంధించిన విషయాలు నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటాయి.

డాక్టర్ కావాలనుకున్న సౌందర్య.. కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్, వెంకటేశ్ , నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా వెంకీ, సౌందర్య జోడి అంటే ప్రేక్షకుల ఫేవరేట్. శివశంకర్ షూటింగ్ సినిమా సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తోన్న సమయంలో విమాన ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. 2004 ఏప్రిల్ 17న ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే సౌందర్య చనిపోయే ముందు చివరిసారిగా తన మేనకోడలితో మాట్లాడరట.

ఆమె తన మేనకోడలితో కాటన్ చీరలు.. కుంకుమ కావాలని చెప్పారట. ఎన్నికల ప్రచారం కోసం తన వద్ద కాటన్ చీరలు లేవని.. అవి కొనాలని.. అలాగే కుంకుమ సైతం తీసుకురావాలని చెప్పారట. ఆ విషయం తన మేనకోడలితో మాట్లాడి ఎన్నికల ప్రచారం కోసం విమానంలో బయలుదేరిన ఆమె ప్రమాదానికి గురయ్యారు. తెలుగుతోపాటు.. హిందీలోనూ అగ్ర కథానాయికగా కొనసాగింది. అమితాబ్ బచ్చన్ సరనస కూడా నటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.