Rashmi Gautam: సురక్షితంగా జీవించడం క్లిష్టంగా మారింది.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన రష్మి
టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలా దానివల్ల కలిగే దుష్ప్రభావల గురించి ఆందోళన చెందాలా.? అన్న విధంగా పరిస్థితులు మారాయి. మారుతోన్న టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాను, టెక్నాలజీని ఆచితూచి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించింది ప్రముఖ నటి...
టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలా దానివల్ల కలిగే దుష్ప్రభావల గురించి ఆందోళన చెందాలా.? అన్న విధంగా పరిస్థితులు మారాయి. మారుతోన్న టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాను, టెక్నాలజీని ఆచితూచి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించింది ప్రముఖ నటి, యాంకర్ రష్మి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరుగుతోన్న అంశాలపై స్పందించే రష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో సురక్షితంగా బతకడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చింది. ఇంతకీ రష్మి ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌పై రష్మి అలా స్పందించింది. ఇంతకీ ఆ నెటిజన్ చేసిన పోస్ట్‌లో ఏముందంటే.. ‘అమ్మాయిలు తమ సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్ చేసుకోండి. డీపీలో మీ ఫొటో ఉంటే తీసేయండి. మీ వ్యక్తిగత ఫొటోలను ఎవ్వరితో పంచుకోవద్దు. కొందరు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి అసభ్యకరమైన ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి’ అని రాసుకొచ్చారు.
దీంతో ఈ పోస్ట్‌ను ఉద్దేశిస్తూ స్పందించిన రష్మి.. ‘ప్రస్తుతం డిజిటల్ యుగంలో సురక్షితంగా జీవించడం కష్టం. అసభ్యకరమైన ఫొటోలు క్రియేట్ చేసే వారికి చిక్కకుండా అమ్మాయిలను దాక్కోమని చెప్పేబదులు.. ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించడం అవసరం. కనిపించేది అంతా నిజం కాదని తెలిసేలా చేద్దాం. సరాదా కోసం ఇలాంటి ఫొటోలు, వీడియోలు వైరల్ చేయొద్దని చెబుదాం’ అని స్పందించింది రష్మి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..