69th Filmfare Awards 2024: 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. యానిమల్, జవాన్ సినిమాల హవా.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే..
ఇక నిన్న టెక్నికల్ కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డులను ప్రకటించారు. ఇక ఈరోజు యాక్టింగ్, డైరెక్షన్ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించనున్నారు. ఈసారి అవార్డులలో మాత్రం యానిమల్, జవాన్, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ సినిమాలు హవా చూపిస్తున్నాయి. ఇప్పటికే మూడు ముఖ్యమైన విభాగాల్లో సామ్ బహదూర్ సినిమా ఏకంగా మూడు అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది.
ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ సినిమా అవార్డుల వేడుక గుజరాత్లో ఘనంగా జరుగుతుంది. శనివారం, ఆదివారం రెండు రోజులు జరుగుతున్న 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలకు నటీనటులు అపర్ శక్తి ఖురానా, కరిష్మా తన్నా హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇక నిన్న టెక్నికల్ కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డులను ప్రకటించారు. ఇక ఈరోజు యాక్టింగ్, డైరెక్షన్ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించనున్నారు. ఈసారి అవార్డులలో మాత్రం యానిమల్, జవాన్, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ సినిమాలు హవా చూపిస్తున్నాయి. ఇప్పటికే మూడు ముఖ్యమైన విభాగాల్లో సామ్ బహదూర్ సినిమా ఏకంగా మూడు అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది.
ఇక రణబీర్ కపూర్, డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా సైతం రెండు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో యానిమల్ చిత్రానికి గానూ హర్షవర్దన్ రామేశ్వర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అలాగే ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో యానిమల్ సినిమాకు సింక్ సినిమా అందుకున్నారు. అలాగే.. బెస్ట్ యాక్షన్ కెటగిరీలో జవాన్ సినిమా ఎంపికైంది. అలాగే బెస్ట్ వీఎఫ్ఎక్స్ కేటగిరీలో జవాన్ సినిమాకు రెడ్ చిల్లీస్ నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గెలుచుకుంది.
ఇక మరికాసేపట్లో ఈరోజు ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక ప్రారంభం కానుంది. ఈరోజు బెస్ట్ యాక్టింగ్, డైరెక్షన్ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించనున్నారు. అయితే ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఉత్తమ దర్శకుడి విభాగంలో అమిత్ రాయ్ (OMG 2), అట్లీ (జవాన్), కరణ్ జోహర్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ), సందీప్ రెడ్డి వంగా (యానిమల్), సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్), విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) నిలిచారు.
అలాగే ఉత్తమ నటుడిగా నామినేట్ అయినవారు.. రణబీర్ కపూర్ (యానిమల్), రణవీర్ సింగ్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ), షారుఖ్ ఖాన్ (డంకీ), షారుఖ్ ఖాన్ (జవాన్), సన్ని డియోల్ (గదర్ 2), విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) నామినేట్ అయ్యారు. అయితే వీరిలో ఈసారి బ్లాక్ లేడీని అందుకోనున్నది ఎవరనేది కాసేపట్లో తెలియనుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.