Saba Nayagan OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మరో అందమైన ప్రేమకథ.. ‘సబా నాయగన్’ స్ట్రీమిండ్ డేట్ ఫిక్స్..
భద్రమ్, మన్మధ లీల, పిజ్జా 2 చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అశోక్ సెల్వన్. ఇప్పటికే ఆయన నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులోకి డబ్ మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో ఆయనకు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ సినిమాలో కలర్ ఫోటో ఫేమ్ హీరోయిన్ చాందిని చౌదరి నటించారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ రివ్యూస్ అందుకుంది.
సీఎస్ కార్తికేయ దర్శకత్వం వహించిన లేటేస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘సబా నాయగన్’. ఇందులో అశోక్ సెల్వన్ హీరోగా కనిపించారు. భద్రమ్, మన్మధ లీల, పిజ్జా 2 చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అశోక్ సెల్వన్. ఇప్పటికే ఆయన నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులోకి డబ్ మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో ఆయనకు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ సినిమాలో కలర్ ఫోటో ఫేమ్ హీరోయిన్ చాందిని చౌదరి నటించారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
నివేదికల ప్రకారం ఈ సినిమా వచ్చే నెలలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ నటించారు. మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్, చాందిని చౌదరి కనిపించారు. అలాగే మైల్ సామి, మైఖేల్ తంగదురై, ఉడమలై రవి, అరుణ్ కుమార్, జైశీలన్ శివరామ్ కీలకపాత్రలు పోషించారు.
సీఎస్ కార్తికేయ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు కమల్ హాసన్ విశ్వరూపం, విశ్వరూపం 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 1న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.