Lavanya Tripathi: నిహారికకు ఆడపడుచు కట్నం ఎంతిచ్చారు? మెగా కోడలు లావణ్య త్రిపాఠీ సమాధానమిదే

వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి వెబ్‌ సిరీస్‌ మిస్‌ పర్‌ఫెక్ట్‌. ఇందులో లావణ్యతో పాటు బిగ్‌ బాస్‌ విన్నర్‌ అభిజిత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Lavanya Tripathi: నిహారికకు ఆడపడుచు కట్నం ఎంతిచ్చారు? మెగా కోడలు లావణ్య త్రిపాఠీ సమాధానమిదే
Lavanya Tripathi
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2024 | 11:10 AM

టాలీవుడ్‌ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీ మళ్లీ ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీ కానుంది. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో కలిసి ఏడడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాలతో సందడి చేయనుంది. ఇందులో భాగంగా మొదట ఓ వెబ్‌ సిరీస్‌ తో మనల్ని పలకరించేందుకు సిద్ధమైందీ అందాల తార. వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి వెబ్‌ సిరీస్‌ మిస్‌ పర్‌ఫెక్ట్‌. ఇందులో లావణ్యతో పాటు బిగ్‌ బాస్‌ విన్నర్‌ అభిజిత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మిస్‌ పర్‌ఫెక్ట్‌ సిరీస్‌ ప్రమోషన్లలో మెగా కోడలు చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

మేమంతా కలిసే ఉంటాం..

ఇందులో భాగంగా ‘మీరు నిహారికతో చాలా క్లోజ్‌గా ఉంటారు కదా. పెళ్లిలో ఆమెకు మీరు ఏమైనా ఆడపడుచు కట్నం ఇచ్చారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన లావణ్య త్రిపాఠి ‘నిహారికకు కట్నం, కానుకల్లాంటివి ఏవీ ఇవ్వలేదు. డబ్బులు కూడా ఏం ఇవ్వలేదు. అసలు నా నుంచి తను ఏం ఎక్స్‌పెక్ట్ చేయదు. అయితే తను మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నిహా కోసం ఏదైనా చేస్తా. తనకు అవసరమైనప్పుడు ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను’

ఇవి కూడా చదవండి

ఫ్రీగా సినిమా చేస్తా..

‘ప్రస్తుతం నిర్మాతగా నిహారిక చాలా బిజీ బిజీగా ఉంటోంది. ఏదైనా మంచి స్టోరీతో వస్తే నిహారిక బ్యానర్‌లో కచ్చితంగా నటిస్తాను. మేమంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి తన నుంచి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తాను. నిహారిక అంటే నాకు చాలా ఇష్టం. తను నాకు మంచి ఫ్రెండ్‌. వరుణ్‌తో పెళ్లికి ముందు నుంచే మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌. పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత నిహాలో ఎలాంటి మార్పు లేదు. అప్పుడు ఎలా ఉన్నామో? ఇప్పుడు అలాగే ఉన్నాం. కాకపోతే ఒకేచోట కలిసి ఉంటున్నాం అంతే. మేమంతా చాలా సంతోషంగా ఉంటున్నాం’ అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

మిస్ పర్‌ఫెక్ట్‌ వెబ్‌ సిరీస్‌ కు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. హర్షవర్దన్, ఝాన్సీ, హర్ష్ రోషన్, మహేశ్ విట్టా, సతీష్ సారిపల్లి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మిస్ పర్ ఫెక్ట్ టీజర్ లో మెగా కోడలు..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..