Shraddha Das: ఆ హీరోయిన్ నన్ను దారుణంగా కొట్టింది.. హాస్పటల్‌లో చేరాను.. హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
డార్లింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించి మెప్పించింది. ఆతర్వాత వచ్చిన ఆర్య 2 సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య 2 శ్రద్ధా దాస్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో తన అందాలతో కవ్వించింది శ్రద్ధా దాస్. తెలుగుతో పాటు హిందీలోనూ నటించి మెప్పిస్తుంది శ్రద్ధా దాస్.
శ్రద్ధా దాస్.. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. సిద్దూ ఫ్రేమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అమ్మడు అయితే వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదానికి హీరోయిన్ గా అంతగా పేరు రాలేదు. డార్లింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించి మెప్పించింది. ఆతర్వాత వచ్చిన ఆర్య 2 సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య 2 శ్రద్ధా దాస్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో తన అందాలతో కవ్వించింది శ్రద్ధా దాస్. తెలుగుతో పాటు హిందీలోనూ నటించి మెప్పిస్తుంది శ్రద్ధా దాస్. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ తనను దారుణంగా కొట్టిందని దాంతో హాస్పటల్ లో చేరారని తెలిపింది.
ఈ ఘటన జరిగి చాలాకాలం అయ్యింది. అప్పటిలో ఈ విషయం పై శ్రద్ధా దాస్ మాట్లాడింది. ఇంతకు ఈ అమ్మడిని కొట్టిన ఆ హీరోయిన్ ఎవరో కాదు మన్నారా చోప్రా.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ ఈ అమ్మడు. ప్రేమ గీమ జాన్‌తా నయ్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మన్నారా చోప్రా. తెలుగులో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది.
అయితే మన్నారా చోప్రా, శ్రద్ధా దాస్ కలిసి హిందీలో ఓ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందట. అయితే ఓ సన్నివేశంలో మన్నారా చోప్రా శ్రద్దా ను తోసే సన్నివేశం ఉందట.. మెల్లగా నెట్టమని చెప్పినా కూడా మన్నారా చోప్రా వినకుండా గట్టిగా నెట్టేసిందట. దాంతో మెట్లు తగిలి శ్రద్ధా దాస్ గాయం అయ్యిందట. సరిలే యాక్టింగ్ కొత్త కథ అని వదిలేసిందట. ఆతర్వాత సీన్ లో తన చాటి పై పంచ్ ఇవ్వాలంట.. కానీ మన్నారా మాత్రం గట్టిగా గుద్దిందట. ఆ తర్వాత సీన్ లో మన్నారా రెచ్చిపోయి తనను గట్టిగా కొట్టేసిందట.. డైరెక్టర్ కట్ చెప్పినా కూడా వినిపించుకోకుండా కొడుతూనే ఉందట. దాంతో తనకు దాదాపు 30 గాయాలు అయ్యాయట.. అలాగే ఓ ఫైట్ సీన్ లో డమ్మీ స్టిక్ తో కొట్టాల్సింది రియల్ స్టిక్ తో కొట్టడంతో నా కంటికి గాయం అయ్యింది. దాంతో నేను హాస్పటల్ లో చేరాల్సి వచ్చింది అని తెలిపింది శ్రద్దా.. ఇది జరిగి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ఈ విషయం పై ఇప్పుడు మాట్లాడటానికి నిరాకరించింది శ్రద్దా. ప్రస్తుతం మన్నారా హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో పాల్గొంది.
మన్నారా చోప్రా ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.