ఆ స్టార్ హీరో చెప్పడం వల్ల నాకు 14 సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చాయి.. ఆయన దేవుడు అంటున్న రాజేంద్రప్రసాద్
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు నాట అందరికీ సుపరిచితమే. తనదైన టైమింగ్‌తో కామెడీని పండించే ఆయన నటన.. సగటు ప్రేక్షకుడిని కూడా కడుపుబ్బ నవ్విస్తుంది. ఎలాంటి పాత్ర అయినా అందులో అలవోకగా ఒదిగిపోయి జీవించేస్తారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నటకిరీటి.

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నటుడు రాజేంద్రప్రసాద్. సహాయక పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ మెప్పిస్తున్నారు . తనదైన కామెడీ టైమింగ్ తో నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి అలరించారు రాజేంద్ర ప్రసాద్. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన తర్వాత హీరోగా మారారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన నటనతో మెప్పించి నటకిరీటి అనే బిరుదు సొంతం చేసుకున్నారు ఆయన. ప్రస్తుతం తండ్రి, మామ, తాత పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్. కాగా గతంలో రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
ఈ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణగారి కీలక పాత్రను, వారి మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి ప్రస్తావిస్తూ.. దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ బాబును సరికొత్త కామెడీతో చూపించారని, మహేష్ బాబుతో పాత్ర “టామ్ అండ్ జెర్రీ” లా ఉందని అన్నారు రాజేంద్ర ప్రసాద్.. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో తన తొలి సినిమా రామరాజ్యంలో భీమరాజు విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో తాను రావు గోపాలరావుగారి కొడుకుగా, విలన్ పాత్రలో నటించానని చెప్పారు.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
తన మొదటి షాట్ ఒక పెళ్లి సన్నివేశమని, అందులో శ్రీదేవిగారితో పాటు కృష్ణ, సత్యనారాయణ, జగ్గయ్య, చంద్రమోహన్ వంటి 23 మంది సీనియర్ నటుల మధ్య నటించాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ భారీ తారాగణం మధ్య నటిస్తున్నప్పుడు, కృష్ణగారు తన చెవిలో “ఒరేయ్, నిజంగానే తాళి కడతావా.? అక్కడ చూడు కత్తులు లేస్తున్నాయి!” అని సరదాగా భయపెట్టారని తెలిపారు. ఆ భయానికి తాను ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ను కృష్ణగారు ఎంతగానో ఆనందించారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. కృష్ణ ఎంతటి మహానుభావుడంటే, కేవలం ఒక్క షాట్ చూసిన తర్వాతే ఆయన బయటికి వెళ్లి కూర్చుని ఉంటే, అక్కడ కే. బాపయ్య, కే. రాఘవేంద్రరావు వంటి ప్రముఖ దర్శకులు కృష్ణగారి కోసం వచ్చారు అప్పుడు కృష్ణగారు వారికి ఈ కుర్రాడు భలే యాక్ట్ చేస్తున్నాడు. ఈ కుర్రాణ్ణి పెట్టుకోండి చాలు అని సిఫారసు చేశారని రాజేంద్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. కృష్ణగారి ఆ ప్రోత్సాహం, ఆయన చేసిన సిఫారసు వల్ల ఏకంగా 14 సినిమాలకు అవకాశం పొందారని తెలిపారు. ఒకేసారి 14 సినిమాలు లభించడం తన సినీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు అని, కృష్ణగారు చూపిన ఆదరణ, మద్దతు తన కెరీర్‌కు పునాది వేసిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
