Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలని ఆశిస్తాడు. కానీ ఆ విజయానికి అవసరమైన కృషిని అందరూ చేయరు. కొందరు తెలిసీ నిర్లక్ష్యం చేస్తే, మరికొందరు తెలియకనే సరైన మార్గాల నుంచి దూరమవుతుంటారు. దాంతో వారు ఆశించిన విజయ శిఖరాలను చేరుకోలేకపోతారు. ప్రముఖ రచయిత రాబిన్ శర్మ విజయానికి అదృష్టం కాదు, మనం రోజూ అలవాటుగా పాటించే చర్యలే ప్రధాన కారణమని స్పష్టంగా చెబుతున్నారు.

ప్రతి మనిషి తన జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే అందుకు తగిన పరిశ్రమ మాత్రం చేయరు కొందరు తెలిసి నిర్లక్ష్యం చేస్తే.. మరికొందరు తెలియక వాటికి దూరంగా ఉంటారు. దీంతో వారు విజయతీరాలకు చేరలేరు. అందుకే ప్రముఖ రచయిత, లీడర్‌షిప్ గురువు రోబిన్ శర్మ.. విజయానికి అదృష్టం కాదు, మన రోజువారీ అలవాట్లు కారణం అని స్పష్టం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రాబిన్ శర్మ ఏ వ్యక్తి అయిన విజయం సాధించాలంటే ఐదు సూపర్ హ్యాబిట్స్ అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటిని మీరు అలవాటు చేసుకుంటే మీరు విజయ తీరాలకు చేరుకుంటారని చెబుతున్నారు. ఆయన సూచించిన 5 హ్యాబిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్లవారుజామునే నిద్ర లేవండి
ప్రపంచం మేల్కొనకముందే మనం మేల్కుంటే పొందే అనుభూతి బాగుంటుందని రాబిన్ శర్మ చెబుతున్నారు. ప్రతి రోజూ తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేవడం అనేది లైఫ్ ఛేంజింగ్ హ్యాబిట్ అని ఆయన అంటారు. సైన్స్ కూడా ఇదే చెబుతుందని అంటున్నారు. రోజు ప్రారంభంలోనే లేచి వ్యాయామం (రన్నింగ్, యోగా లేదా వేట్ల్ లిఫ్టింగ్) చేస్తే శక్తి, ఫోకస్, శ్రద్ధ పెరుగుతాయని శర్మ సూచిస్తాడు. ఇది ఉదయం మనసు, శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది.
రోజుకు కనీసం 1 గంట చదవండి
రోజులో కనీసం ఒక గంట చదవడం.. అది బయోగ్రఫీలు, తత్వశాస్త్రం, ఆత్మవికాస గానీ.. మన ఆలోచన శక్తిని పెంచుతుంది, క్రియేటివిటీని మెరుగుపరుస్తుందన్నారు. నిర్ధారణల ప్రకారం చదువడం మనసు విశ్రాంతి కూడా ఇస్తుంది. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటి సంపన్నులకు పుస్తక పఠనం అనేది అలవాటు అని చెప్పారు.
నియంత్రించలేని విషయాల గురించి ఆందోళన చెందవద్దు
మన నియంత్రణలో లేని వాటి గురించి బాధపడటం మంచిది కాదంటున్నారు రాబిన్ శర్మ. జీవితంలో విజయం సాధించినవారు అలాంటి విషయాలను పక్కనపెట్టి లక్ష్యంపై దృష్టి సారించారని చెబుతారు. మన శక్తిని మన చర్యలపై కేంద్రీకరించాలని అంటున్నారు. ధ్యానం, జర్నలింగ్ వంటి సాధనలతో మనస్సు ప్రశాంతం చేస్తే ఆందోళన తగ్గుతుంది.
వారానికి ఒకరోజు డిజిటల్ డిటాక్స్ చేయండి
వారానికి ఒకరోజు డిజిటల్ డిటాక్స్ చేయాలని రాబిన్ శర్మ సూచిస్తున్నారు. పోన్లను, స్క్రీన్లను మానేయటం ద్వారా మనసు ప్రశాంతం అవుతుంది. కుటుంబంతో, ప్రకృతితో, మన హాబీలతో సమయాన్ని గడపటం ద్వారా మనలో స్థిరత్వాన్ని ఏర్పరచుకోవచ్చన్నవారు.
రోజూ ఒక చిన్నకి మంచి పనిని చేయండి
దయా గుణం కలిగి ఉండటం అనేది బలహీనత కాదని.. బలమని రాబిన్ శర్మ చెబుతారు. దయ, సహకారం వంటి సానుభూతి చర్యలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. చిన్న పనులు అయినా మంచి చేస్తే మనలో ఉత్సాహం, శాంతి పెరుగుతుంది. ఇది నిజమైన లీడర్‌షిప్ లక్షణం అని శర్మ చెబుతున్నారు. అందుకే రోజులో ఎవరికైనా ఒక చిన్న సాయం చేయాలని సూచిస్తున్నారు.
