AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tickets Booking App: పండక్కి ఇంటికెళ్లే ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఈ యాప్ ద్వారా అన్నీ టికెట్లు ఒకేచోట..

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించేందుకు డిజిటల్ సేవలను విస్తరిస్తోంది. ఇటీవల రేషన్ సరుకుల వివరాలు తెలుసుకునేలా టీ రేషన్ యాప్ ఆవిష్కరించింది. ఇక రైతుల కోసం యూరియా బుకింగ్ యాప్ తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్‌ తీసుకొచ్చింది.

Tickets Booking App: పండక్కి ఇంటికెళ్లే ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఈ యాప్ ద్వారా అన్నీ టికెట్లు ఒకేచోట..
Mee Ticket App
Venkatrao Lella
|

Updated on: Jan 11, 2026 | 7:35 PM

Share

ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే టీజీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మెట్రో టికెట్ బుక్ చేసుకోవాలంటే మెట్రో యాప్ లేదా ఇతర యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా సాధ్యమవుతుంది. ఇక పర్యాటక ప్రదేశాలు, దేవాలయాల దర్శనం టికెట్ల కోసం ఆయా వెబ్ సైట్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సేవకు ఏదోక ఫ్లాట్‌ఫామ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదే అన్నింటికీ ఒకే యాప్ ఉంటే.. అవును.. అన్నీ టికెట్లు ఒకేచోట బుక్ చేసుకునే సదుపాయం ఉంటే ప్రజలకు పని మరింత సులువు అవుతుంది. అలాగే టైమ్ కూడా ఆదా అవుతుంది. అన్నీ టికెట్లు ఒకేచోట బుక్ చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఓ యాప్ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఒకేచోట అన్నీ టికెట్లు

ఒకే ఫ్లాట్‌ఫామ్‌లో అన్నీ టికెట్లు బుక్ చేసుకునేలా ‘మీ టికెట్’ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఆర్టీసీ, మెట్రో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీస్ డెలివరీ సంస్థ ఈ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ గురించి చాలామందికి అవగాహన లేక లేదా తెలియక ఉపయోగించుకోవడం లేదు. ఈ యాప్‌లో ట్రావెల్ టికెట్లతో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, దేవాలయాల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సంక్రాంతి పండక్కి ఇంటికెళ్లేవారికి లేదా టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లేవారికి ఈ యాప్ చాలా ఉపయోగపడనుంది.

యాప్ ఎలా ఉపయోగించాలంటే..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీ టికెట్ యాప్ అని సెర్చ్ చేయండి -తెలంగాణ ప్రభుత్వ లోగోతో మీ టికెట్ పేరుతో ఉండే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి -యాప్‌ను ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి -ఓపెన్ అయ్యాక ఆర్టీసీ, మెట్రో, దేవాలయాలు, సందర్శన ప్రదేశాల ఆప్షన్లు కనిపిస్తాయి -వాటిని సెలక్ట్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోండి -ఆన్ లైన్ ద్వారానే సులువుగా పేమెంట్ చేయవచ్చు. -టికెట్లు బుక్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్‌తో కూడిన టికెట్లు వస్తాయి -క్యూఆర్ కోడ్ ఆధారంగా టికెట్లను ధృవీకరించుకోవచ్చు

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
మౌని అమావాస్యనాడు పూర్వీకులు కలలోకి వస్తే.. శుభమా? అశుభమా?
మౌని అమావాస్యనాడు పూర్వీకులు కలలోకి వస్తే.. శుభమా? అశుభమా?
120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార ఎంత తీసుకుంటుందంటే..
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార ఎంత తీసుకుంటుందంటే..