Tollywood: విడుదలైన రెండేళ్లకు బుల్లితెరపైకి వస్తోన్న సినిమా.. థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ ఎప్పుడంటే..
ఒక థ్రిల్లర్ మూవీ మాత్రం విడుదలైన 2 ఏళ్ల తర్వాత బుల్లితెరపైకి రాబోతుంది. ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా ? అదే కటపధారి. అక్కినేని సుమంత్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2021లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ప్రస్తుతం ఓటీటీ సంస్థలు సినీ ప్రియులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ అందిస్తున్నాయి. సూపర్ హిట్ చిత్రాలతోనే కాదు.. టాక్ షోస్..గేమ్ షోస్ అంటూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అలాగే థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ కురిపించిన చిత్రాలు సైతం నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక థియేటర్.. ఓటీటీ అనంతరం.. చివరగా బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. కానీ ఒక థ్రిల్లర్ మూవీ మాత్రం విడుదలైన 2 ఏళ్ల తర్వాత బుల్లితెరపైకి రాబోతుంది. ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా ? అదే కటపధారి. అక్కినేని సుమంత్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2021లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఈ సినిమా కన్నడ చిత్రం కవలుదారికి రీమేక్. ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. థియేట్రికల్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఇప్పటివరకు టెలివిజన్ ప్రీమియర్ లేదు.
చివరగా సినిమా విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఫిబ్రవరి 18న స్టార్ మాలో మధ్యాహ్నం 03.30 గంటలకు ప్రసారం కానుంది. ఇందులో నందితా శ్వేత, నాజర్, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సుమన్ రంగనాథన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సైమన్ కె. కింగ్ సంగీతం అందించారు.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
