Sridevi Sobhan Babu: బుల్లితెరపై సందడి చేయనున్న ‘శ్రీదేవి శోభన్ బాబు’.. ఎక్కడ చూడొచ్చంటే..
డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మించారు. ఫిబ్రవరి 18న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ గౌరి జి కిషన్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటేస్ట్ చిత్రం శ్రీదేవి శోభన్ బాబు. డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మించారు. ఫిబ్రవరి 18న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఓటీటీలో ఈమూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమా స్టా్ర్ మాలో ఆదివారం మధ్యాహ్నం 1.00 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. అయితే థియేటర్లు, ఓటీటీలో మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల నిర్మించగా.. కమ్రాన్ సంగీతం అందించారు. ఇందులో సంతోష్, గౌరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తున్నారు సంతోష్. ఇటీవల అన్ని మంచి శకునములే మూవీ ఆడియన్స్ ను పలకరించారు.
ఇందులో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా.. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈ సినిమా మాత్రం ఓటీటీలో సూపర్ హిట్ అయ్యింది. ఊహించని రీతిలో ఈ సినిమాకు రెస్పాన్స్ వచ్చింది.