AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIFA Awards 2024: ఐఫాను ఊపేసిన పుష్ఫ.. ‘ఊ అంటావా’ పాటకు షారుఖ్ ఖాన్, విక్కీల స్టెప్పులు.. వీడియో చూడండి

ఐఫా అవార్డుల ఈవెంట్ కు బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ హోస్టులుగా వ్యవహరించారు. అతిథులను అలరించేందుకు వేదికపై హుషారైన స్టెప్పులు వేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టారు షారుఖ్, విక్కీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

IIFA Awards 2024: ఐఫాను ఊపేసిన పుష్ఫ.. 'ఊ అంటావా’ పాటకు షారుఖ్ ఖాన్, విక్కీల స్టెప్పులు.. వీడియో చూడండి
Shahrukh Khan, Vicky Kaushal
Basha Shek
|

Updated on: Sep 29, 2024 | 6:30 PM

Share

సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం అబుదాబి వేదికగా కన్నుల పండువగా జరగుతోంది. సెప్టెంబర్ 27న మొదలైన ఈ అవార్డుల వేడుక ఆదివారం (సెప్టెంబర్ 29)తో ముగియనుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ సినీ పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఫా అవార్డుల ఈవెంట్ కు బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ హోస్టులుగా వ్యవహరించారు. అతిథులను అలరించేందుకు వేదికపై హుషారైన స్టెప్పులు వేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టారు షారుఖ్, విక్కీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతే కాకుండా ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఈ సాంగ్‌కు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం. వీటికి సంబంధించిన వీడియోలను మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వేడుకల్లో షారూఖ్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి గానూ ఆయన ఈ అవార్డ్ దక్కించుకున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగాఈ అవార్డు అందుకున్నారు కింగ్ ఖాన్.

ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్’ అవార్డుతో సత్కరించారు ఐఫా నిర్వాహకులు. అలాగే నందమూరి బాలకృష్ణకు ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును ప్రదానం చేశారు. ఇక బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ తమిళంలో ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. పొన్నియన్ సెల్వన్ 2 మూవీలో ఆమె నటనకు గానూ ఈ అవార్డు దక్కింది. వీరితో పాటు వెంకటేశ్, సమంతతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఐఫా అవార్డుల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

దేవర సినిమా మరో అరుదైన ఘనత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.