Brahmamudi, September 30th Episode: సామంత్ చేతికి కావ్య డిజైన్లు.. అప్పూకి దొరికిపోయిన కళ్యాణ్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ దగ్గరకు ఇందిరా దేవి వస్తుంది. అప్పటికే రాజ్ పేపర్స్ అన్నీ చిందర వందరగా పడేసి ఉంటాడు. సరే ఇదిగో సరుకుల లిస్ట్ అని ఇందిరా దేవి అంటే.. నాకు ఎందుకు ఇస్తున్నావ్? నాన్నమ్మా.. వెళ్లి ఆ కళావతికి ఇవ్వు. తనేగా అన్నీ చూసుకునేది అని రాజ్ అంటాడు.. అలాగే డ్రైవర్ రాముడిని తీసుకెళ్లనా అని పెద్దావిడ అంటుంది. ఎందుకు? అని రాజ్ అంటాడు. కనకం ఇంటికి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ దగ్గరకు ఇందిరా దేవి వస్తుంది. అప్పటికే రాజ్ పేపర్స్ అన్నీ చిందర వందరగా పడేసి ఉంటాడు. సరే ఇదిగో సరుకుల లిస్ట్ అని ఇందిరా దేవి అంటే.. నాకు ఎందుకు ఇస్తున్నావ్? నాన్నమ్మా.. వెళ్లి ఆ కళావతికి ఇవ్వు. తనేగా అన్నీ చూసుకునేది అని రాజ్ అంటాడు.. అలాగే డ్రైవర్ రాముడిని తీసుకెళ్లనా అని పెద్దావిడ అంటుంది. ఎందుకు? అని రాజ్ అంటాడు. కనకం ఇంటికి.. నీ కళావతి అక్కడే కదా ఉంటుందని పెద్దావిడ చెబుతుంది. కట్ చేస్తే.. కావ్యకి నచ్చజెబుతుంది కనకం. నన్ను ఆ రోజు అది అన్నాడు.. ఈ రోజు ఇది అన్నాడు.. నన్ను అంత మాట అంటాడా.. అన్న ఆలోచనలు నీ మనసును వికలం అయ్యేలా చేస్తాయి. ఒక మనిషి ఏదన్నా అన్నాడంటే.. అంతుకు ముందు చేసినవన్నీ మర్చిపోతాయని అంటుంది.
కాపురం నిలబెట్టుకోమన్న కనకం..
ఇగో అంటే అంటే ఏంటిరా.. నేను అన్న అహం.. అది పక్కన పెట్టి మనం అనుకుంటే అనుబంధం. నీకు నీ భార్య మీద ప్రేమ ఉంది. అందుకే మర్చిపోలేక పోతున్నావు. ఆ ఆలోచనల నుంచి బయట పడలేక పోతున్నావు. కొన్ని వ్యసనాలు మానేసినా.. గుర్తుకు వస్తూనే ఉంటాయని రాజ్ అంటాడు. మరి నువ్వు కావ్య అనే వ్యసనాన్ని మర్చిపోగలవా అని ఇందిరా దేవి అడిగితే.. ఖచ్చితంగా అని రాజ్ అంటాడు. మరి నువ్వేం రాసావురా కళాకృతి బదులు కళావతి అని రాశావని పెద్దావిడ ఓ మొట్టికాయ ఇచ్చి వచ్చేస్తుంది. ఈ కాగితాలు పడేసినట్టు.. నువ్వు నిలబెట్టుకునే కాపురాన్ని పక్కన పెట్టేస్తే నేను ఊరుకుంటానా? నీ మేలు కోరి చెబుతున్నా.. కాపురాన్ని సరిచేసుకో.. సర్ధుకోమని కనకం చెప్పి వెళ్తుంది. దీంతో కావ్య ఆలోచనలో పడుతుంది.
అలిగిన కళ్యాణ్..
మరోవైపు.. కళ్యాణ్ అలిగి పక్కన కూర్చుంటాడు. అప్పుడే అప్పూ అన్నం తీసుకొచ్చి తినమంటుంది. నాకు వద్దు నేను తినను.. నా మాట ఎవరూ వినడం లేదు. కట్టుకున్న భార్యను పోలీస్ చేయడం కూడా పాపమేనా? అని అంటాడు. అది కాదు కూచి.. ఇప్పుడు అన్ని డబ్బులు మనకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇల్లు గడవడమే కష్టంగా ఉంది కదా అని అప్పూ అంటే.. అది నా బాధ నేను పడతానని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు నువ్వు నా కోసం అంత కష్ట పడుతుంటే నాకు చాలా బాధగా ఉందని అప్పూ అంటుంది. మరి నీ కోసం నేను ఎంత కష్ట పడుతున్నానో నీకు తెలుసా? ఒకసారి నా వైపు నుంచి ఆలోచించు.. నేను దేనికీ పనికి రానని అన్నారు.. వాటిని నేను రుజువు చేయమంటావా.. జీవితాంతం ఓడిపోయిన భర్తలా ఉండమంటావా? అని కళ్యాణ్ అంటాడు. సరేలే నువ్వు చెప్పినట్టే చేస్తానని అప్పూ అంటుంది. దీంతో కళ్యాణ్ సంతోషంగా తింటాడు.
వెళ్లి కావ్యని తీసుకురమ్మన్న అపర్ణ..
ఆ తర్వాత రాజ్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అపర్ణ పూజ చేస్తూ.. కింద పడబోతూ ఉంటే.. రాజ్ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మమ్మీ ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అని అడుగుతాడు. మరి ఎవరు చేస్తారు? ఇంట్లో దీపం వెలిగించే కోడల్ని ఇంట్లోంచి గెంటేశావు కదా.. నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావ్? కదా అని అపర్ణ అంటుంది. అది కాదు మమ్మీ అని రాజ్ అంటే.. నీ వల్ల నా కోడలు మనసు విరిగి ఇంట్లోంచి వెళ్లిపోయింది. నువ్వు తీసుకు రావు.. అది రాదు.. మరి ఎవరు వెళ్తారు? ఎవరు తీసుకొస్తారని అపర్ణ అంటుంది. ఏంటో భూమి గుండ్రంగా ఉందని ఇంట్లో అందరూ రుజువు చేస్తున్నారని రాజ్ అంటాడు. పళ్లు రాలగొడతా.. అన్నీ అయ్య బుద్ధులే వచ్చాయి కదా.. ఏం చేసినా చెల్లి పోతుందనే పురుష అహంకారమని అపర్ణ అంటుంది. నేను వెళ్లి పిలిచినా రాలేదు.. నువ్వు రమ్మన్నా రాలేదని రాజ్ అంటాడు. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పకు అని అపర్ణ అంటాడు. ఆవిడ బదులు ఒక బొమ్మను ఇస్తుందట.. నీ కోసం ఎన్ని మెట్లు దిగినా.. ఆవిడ పైనుంచి దిగనంటుంది.. ఐయామ్ సారీ మమ్మీ అని రాజ్ చెప్పేసి వెళ్తాడు.
అదిరిపోయే డిజైన్స్ వేసిన కావ్య.. అవార్డు మనకే..
కట్ చేస్తే.. డిజైన్స్ గురించి సామంత్ ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. డిజైన్స్ చూడాలి.. మాను ఫ్యాక్చర్ చేయించాలి.. ఆ తర్వాత ఎక్స్ పోకి పంపించాలి.. ఇంత తక్కువ టైమ్‌లో సాధ్యమవుతుందని అంటాడు. సామంత్ టెన్షన్ పడకు.. ఆ కావ్య ఇస్తాను అంటే తీసుకొస్తుందని అనామిక అంటుంది. అప్పుడే కావ్య మీటింగ్ హాల్‌కి వస్తుంది. కావ్య రావడంతో.. సామంత్, అనామికలు దాక్కుంటారు. ఇక కావ్యని చూసిన సురేష్.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పదండి అని కిందుకు తీసుకెళ్తాడు. కావ్య వెళ్లిపోయాక.. ఛ.. నా ఆఫీస్‌లోనే నేను చీప్‌గా టేబుల్ కింద దాక్కోవాల్సిన ఖర్మ పట్టిందని.. సామంత్ ఫీల్ అవుతూ ఉంటే.. అనామిక కూల్ చేస్తుంది.
రంగంలోకి దిగిన రాజ్..
మరోవైపు ఎంప్లాయిస్ వేసి డిజైన్స్ చూపిస్తుంది శ్రుతి. కానీ అవేమీ రాజ్‌కు నచ్చవు. ఎక్స్ పోలో స్వరాజ్ కంపెనీ నుంచి డిజైన్స్ వెళ్తున్నాయంటే అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. కానీ ఇలాంటివి తీసుకెళ్తే.. కాంపిటేషన్‌లో లాస్ట్‌లో పడేస్తారని అరుస్తాడు. శ్రుతి చెప్పినా వినిపించుకోడు. ఇక లాభం లేదు నేనే రంగంలోకి దిగుతానని రాజ్ డిజైన్స్ వేస్తాడు. ఇక కావ్య వేసిన డిజైన్స్ వేసిన అన్నీ సామంత్‌కి చూపిస్తాడు సురేష్. అది చూసి వావ్ చాలా బాగున్నాయి. నువ్వు కావ్య గురించి చెబుతుంటే ఏదో బిల్డప్ ఇస్తున్నావ్ అనుకున్నా కానీ డిజైన్స్ అన్నీ చాలా అద్భుతంగా వేసిందని సామంత్ అంటాడు. తన గురించి తన కంటే నాకే బాగా తెలుసని అనామిక అంటుంది. రాజ్ నిజంగానే పిచ్చోడు.. లేకపోతే ఇంత టాలెంట్ ఉన్నా అమ్మాయిని దూరం చేసుకుంటాడా.. ఈ డిజైన్స్ వాడుకుని ఆ రాజ్‌పై ఎలా పై చేయి సాధిస్తానోనని సామంత్ అంటాడు. పై చేయి మాత్రమే కాదు.. అవార్డ్ కూడా మనకే రావాలని అనామిక అంటుంది.
అప్పూకి తెలిసిపోయిన నిజం..
మరోవైపు ఓ రౌడీ కళ్యాణ్ ఆటో ఎక్కుతాడు. ఆటో దిగి డబ్బులు ఇవ్వకుండా వెళ్తాడు. దీంతో కళ్యాణ పరిగెడుతూ డబ్బులు ఇవ్వమని అంటాడు. నేనే ఎవరో తెలుసా.. నన్నే డబ్బులు ఇవ్వమంటావా.. పహిల్వాన్ శంకరన్న.. కార్పోరేటర్‌కి రైట్ హ్యాండ్ అని అంటాడు. అప్పుడే కూరగాయలు కొనడానికి వచ్చిన అప్పూ కళ్యాణ్‌ని చూస్తుంది. కళ్యాణ్‌ని కొట్టబోతుండగా శంకరన్న చేయిని అడ్డుకుంటుంది. ఎవరే నవ్వు నన్నే ఆపుతావా అని శంకరన్న అంటే.. నువ్వు ఎవడివి అయితే నాకెందుకు రా.. పైసలు ఇవ్వాలి ఇవ్వమని అప్పూ పిచ్చగా కొడుతుంది. దీంతో డబ్బులు ఇచ్చి రౌడీ వెళ్లిపోతాడు. అంటే నువ్వు చెప్పిన పికప్ అండ్ డ్రాప్ ఇదేనా? ఎందుకు రా నాకు కూడా అబద్ధం చెప్పావని అప్పూ అంటే.. అదీ పొట్టి నిజం చెప్తే.. నువ్వు ఏమంటావో అని చెప్పలేదని అంటాడు కళ్యాణ్. నువ్వు ఇలా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తావని అనుకోలేదు. అప్పుడే ఒకతను వచ్చి రామ్ నగర్ వస్తావా అని అడుగుతాడు. దీంతో అప్పూ కోపం తెచ్చుకుని వెళ్లిపోతుంది. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..