Geethanjali Serial: హిట్ సీరియల్ ‘సెవ్వంతి’ రీమేక్‌గా గీతాంజలి.. త్వరలో ప్రేక్షకుల ముందుకు బుల్లితెర మంచి కోడలు సుజిత..

బుల్లి తెరపై అడుగు పెట్టిన అనేక కుటుంబ కథా సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది సుజిత. ఇటీవల వదినమ్మ సీరియల్ శుభం కార్డు వేసుకుంది. అయితే తాజాగా మరో కుటుంబ కథ తో బుల్లి తెరప్రేక్షకుల ముందుకు రానుంది సుజిత.

Geethanjali Serial: హిట్ సీరియల్ 'సెవ్వంతి' రీమేక్‌గా గీతాంజలి.. త్వరలో ప్రేక్షకుల ముందుకు బుల్లితెర మంచి కోడలు సుజిత..
Geethanjali Serial
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2023 | 9:58 AM

కేరళ కుట్టి.. నటి సుజిత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సినఅవసరం లేదు. వెండి తెరపై బాలనటిగా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. కాలక్రమంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో బాలనటిగా నటించిన మెప్పించిన సుజిత.. గణేష్ సినిమాలో వెంకటేష్ చెల్లెలు గా..  జై చిరంజీవి మూవీలో చిరంజీవి చెల్లిగానూ నటించింది. అలా వెండితెరపై సుజిత సందడి చేసింది. కాలక్రమంలో బుల్లి తెరపై అడుగు పెట్టిన అనేక కుటుంబ కథా సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది సుజిత. ఇటీవల వదినమ్మ సీరియల్ శుభం కార్డు వేసుకుంది. అయితే తాజాగా మరో కుటుంబ కథ తో బుల్లి తెరప్రేక్షకుల ముందుకు రానుంది సుజిత.

సుజిత ధనుష్ టైటిల్ పాత్రలో గీతాంజలి అనే సరికొత్త సీరియల్ తో త్వరలో బుల్లితెర మీద కనిపించబోతోంది. ఇదే విషయాన్ని సుజిత ధనుష్ తన సోషల్ మీడియాలో గీతాంజలి టీజర్ ను షేర్ చేసి.. త్వరలో జెమినిలో ప్రసారం కానుంది అని పేర్కొంది.  ఈ డైలీ సీరియల్ లో సుజిత ధనుష్ , రవికిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. నరసింహరాజు, లహరి తదితరులు నటించనున్నారు. ఈ టీజర్ లో గీతాంజలి కుటుంబ.. సభ్యులను పరిచయం చేస్తూ.. వారి ఆశలు, వాళ్ళ కోరికలను తెలియజేసింది. కుటుంబ సభ్యులందరికి.. ఒకొక్కలో ఒకొక్క ఆశ ఉంది. ఐటీ గీతాంజలి మాత్రం తన భర్త కోరిక నెరవేరాలని కోరుకుంటుంది.  గీతాంజలి భర్త కూడా భార్య ఆశే తన ఆశ అని చెప్పాడు..

ఇవి కూడా చదవండి

గీతాంజలి కూడా రీమేక్ సీరియల్.. తమిళంలో సూపర్ హిట్ సీరియల్ “సెవ్వంతి”కి తెలుగు రీమేక్.

View this post on Instagram

A post shared by Sujithar (@sujithadhanush)

తమిళంలో మంచి రేటింగ్ సంపాదించుకున్న “సెవ్వంతి”కి తెలుగు రీమేక్ ఈ సీరియల్. సుజిత సీరియల్స్ లోనే కాదు సిల్వర్ స్క్రీన్ మీద తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్ లో నటించింది. సుజిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. బుల్లితెర మీద ఎక్కువగా చీరకట్టులో  సంప్రదాయంగా కనిపించే సుజిత.. తెలుగువారి మనసు దోచిన మంచి కోడలు సుజిత.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..