Anchor Anasuya: అనసూయ స్థానాన్ని భర్తీ చేయనున్న నయా యాంకరమ్మ.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?..
మరోవైపు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే అనసూయ సూధీర్ఘకాలంగా ప్రముఖ కామెడీ షో జబర్ధస్థ్ లో కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్ర ప్రజలకు యాంకర్ అనసూయ (Anasuya) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు యాంకరింగ్ చేస్తూ.. మరోవైపు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే అనసూయ సూధీర్ఘకాలంగా ప్రముఖ కామెడీ షో జబర్ధస్థ్ లో కొనసాగుతుంది. ఇక ఇటీవలే ఈ షోకు గుడ్ బై చెప్పేసింది. తాను జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది. దీంతో అనసూయ స్థానంలో వచ్చే కొత్త యాంకర్ ఎవరు ? అని సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్స్. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ మళ్లీ జబర్థస్త్ షోకు కూడా యాంకర్ గా వ్యవహరించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో లేటేస్ట్ ప్రోమోతో కొత్త యాంకర్ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఇచ్చారు మేకర్స్.
ఇటీవల విడదలైన ప్రోమోలో కొత్త యాంకర్ రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్. అందులో పల్లకిలో ఆమెను తీసుకువచ్చి ఘనస్వాగతం పలికారు. కొత్త యాంకర్ వస్తుందని చెప్పిన మేకర్స్.. ఆమె ముఖం చూపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం చేతి గాజులు, చెవి కమ్మలు మాత్రమే చూపిస్తూ ప్రోమో కట్ చేసి.. మరింత సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో కొత్త యాంకర్ ఎవరా అని ఊత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అనసూయ స్థానాన్ని రష్మీ లేదా యాంకర్ మంజుషా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి జబర్ధస్త్ కొత్త యాంకర్ ఎవరనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.