Hyderabad: సెట్లో ఓవరాక్షన్ చేసిన హీరో.. చెంప చెల్లుమనిపించిన తెలుగు క్రూ.. వీడియో వైరల్
'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్ హీరో చందన్‌కుమార్ షూటింగ్ సమయంలో ఓవరాక్షన్ చేశాడు. దీంతో అందుకు తగ్గ కౌంటర్ ఇచ్చారు యూనిట్. చెంప చెల్లుమనిపించారు.
Savitramma Gari Abbayi:ఆయనో హీరో… కాకపోతే సీరియల్స్‌లో. పేరు చందన్ కుమార్ (Chandan Kumar) . సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ చేశాడు. ప్రజంట్ తెలుగులో “శ్రీమతి శ్రీనివాస్” సీరియల్‌లో నటిస్తున్నాడు. ఈ ధారావాహిక షూటింగ్ సందర్భంగా సదరు హీరో గారు.. ఓవరాక్షన్ చేశాడు. షూటింగ్ వర్క్ చేస్తున్న క్రూను నానాబూతులు తిట్టాడు. హీరోయిజమంటే రౌడీలా బిహేవ్ చెయ్యడం అనుకున్నట్టున్నాడు. టెక్నిషియన్‌పై నోరుపారేసుకుని వీరలెవెల్లో పోజులిచ్చాడు. మన దగ్గరికి వచ్చి పని చేసుకుంటూ.. మన వాళ్లనే తిడితే ఊరుకుంటారా. దీంతో యూనిట్ అంతా తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన మదర్‌ను దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు. ఇప్పుడు బుల్లితెర హీరో చందన్‌పై దాడి సర్వత్రా హల్‌చల్ చేస్తోంది. ఎగ్గస్ట్రాలు చేస్తే అంతే ఉంటది మరి. తేడా వస్తే మామ్మూలుగా ఉండదు. ఏదో చిన్న టెక్నిషియన్ కదా! తన మదం చూపిద్దామనుకుంటే మొత్తానికే మోసం వచ్చింది. చందన్ చెంపపగలగొట్టి మరీ బుద్ధి చెప్పారు. శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ షూటింగ్ సందర్భంగా జరిగిన ఈ ఘటన సర్వత్రా కలకలం రేపింది. చివరకు సారీ చెప్పక తప్పలేదు మన హీరోగారికి. ఓ పక్క పరువై పోయి, మరో పక్క రౌడీగా మిగిలిపోయాడు హీరోగారు. కాగా నెల రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. వీడియో తాజాగా బయటకు వచ్చింది.
చందన్ చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. కన్నడలో ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి సీరియల్స్‌లో నటించాడు. అనేక రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నాడు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 3′ షోకి కంటెస్టెంట్ కూడా వెళ్లాడు. అతను 2021 లో టీవీ నటి కవితా గౌడను వివాహం చేసుకున్నాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.