Krishna Mukunda Murari Episode October 7th, 2023: ముకుంద చీటీని మార్చేసిన కృష్ణ.. అవసరం అయితే చంపేస్తా తప్పదు కదా అంటూ వార్నింగ్..
లవ్ యు ముకుంద.. నీ ఆశని ధ్యాసని అన్ని కలిసి ఒక్క మాటతో ఆదర్శ్ రావాలి రాశావు చూడు సూపర్.. ఇదే అలవాటు చేసుకో.. ఇంకొకరు జీవితంలో తొంగి చూడడం మానుకో అని అంటే అదినేను రాయలేదు అని అంటుంది. మరి పనిగట్టుకుని నీ పేరు ఎవరు రాశారు. మా ఏసీపీ సార్ రాసేందుకు అవకాశం లేదు అని అంటే.. మాట మాటకు ఏసీపీ సార్ అని నాకు కంపరంగా ఉంది. నా భర్తను నేను అలాగే పిలుచుకుంటా..
వినాయక చవితి జరిపించిన కృష్ణ ఎవరి మనస్సులో ఏముందో దానిని చీటీల్లో రాశి ఒక బౌల్ లో వేస్తె.. దానిని పెద్డత్తయ్య తీసి చదువుతారుఅని చెబుతుంది. అందరితోనూ గుంజీలు తీయిస్తోంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది ముకుంద అని అంటుంది అలేఖ్య. ముకుంద వినాయకుడికి దణ్ణం పెట్టుకోకుండా గుంజీలు తీయడానికి రెడీ అవుతుంటే.. పరిహారంగా 15 గుంజీలు తియ్యాలి అని అంటుంది కృష్ణ,. ఇలాంటి రూల్ ఏమీ లేదు నువ్వు కావాలని చేస్తున్నావు అని ముకుంద అని అంటే.. నేను ఎందుకు కావాలని చేస్తా.. అలా చెయ్యాలంటే నువ్వు నాకు ఏమైనా చేసావా అని అంటుంది కృష్ణ. చెప్పు ముకుంద చేశావా.. అడుగుతుంది కదా చెప్పు ముకుంద అని రేవతి వంత పాడుతుంది. దీంతో భవానీ కలగజేసుకుని కృష్ణ చెప్పింది నిజమేగా అంటూ వినాయక చవితికి గుంజీలు తియ్యడం వెనుక ఉన్న పురాణ కథని చెప్పి గుంజీలు తియ్యమని చెబుతుంది భవానీ..
ముకుంద చీటీని మార్చేసిన కృష్ణ
భవానీని ఎవరి మనసులో ఏముందో చదవమని చెప్పి బౌల్ ఇస్తుంది. మొదట ప్రభాకర్ .. రాసిన చీటీ తీసి నేను నా బిడ్డ అల్లుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని రాసినా అంతే అని చెబుతాడు ప్రభాకర్.. తర్వాత మురారీ రాసిన చీటీ తీసి మేమిద్దరం సంతోషంగా ఉండాలని రాసినది చదువుతుంది. నా పేరు రాయాలని అనుకున్నా కానీ ఇద్దరం ఎవరు అడిగి తీరుతా అని అనుకుంటుంది.. ఇంతలో ముకుంద.. అని అంటే.. అమ్మయ్య ఇప్పుడు బాంబ్ పేలుతుంది. అత్తయ్య ఊరు వెళ్లడం మాని నా తరపున మాట్లాడుతుంది. అని అంటుకుంటే.. ఏమి రాసింది అని అంటే.. ఆదర్శ్ ని కలవాలని అని రాసింది అని చెబుతుంది భవానీ. ఎందుకు ముకుంద ఆదర్శ్ కోసం అంత బాధపడుతున్నావు.. వస్తారు కదా అని కృష్ణ అంటే.. అవును నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు అర్ధం అవుతుందని భవానీ చెబుతుంది. అందరూ కలిసి భోజనం చేయడానికి వెళ్లారు.
ఆవకాయ తిని చాలా రోజులు అవుతుంది అని మధు అనుకుంటుంటే అలేఖ్య వస్తుంది. జీవితం అంటే విరక్తి కలుగుతుంది అని అంటే.. సన్యాసంలో కలుస్తావా అంత సీన్ లేదు అని అలేఖ్య ఎద్దేవా చేస్తుంది మధుని.
ఇలాంటి చవకబారు పనులు చేయడానికి సిగ్గులేదా
ముకుంద తన చీటీ ఎలా మారింది అని ఆలోచిస్తుంది. కృష్ణ మార్చడానికి అవకాశం లేదు ఎలా అని ఆలోచిస్తుంటే.. కృష్ణ వచ్చి లవ్ యు ముకుంద.. నీ ఆశని ధ్యాసని అన్ని కలిసి ఒక్క మాటతో ఆదర్శ్ రావాలి రాశావు చూడు సూపర్.. ఇదే అలవాటు చేసుకో.. ఇంకొకరు జీవితంలో తొంగి చూడడం మానుకో అని అంటే అదినేను రాయలేదు అని అంటుంది. మరి పనిగట్టుకుని నీ పేరు ఎవరు రాశారు. మా ఏసీపీ సార్ రాసేందుకు అవకాశం లేదు అని అంటే.. మాట మాటకు ఏసీపీ సార్ అని నాకు కంపరంగా ఉంది. నా భర్తను నేను అలాగే పిలుచుకుంటా.. నీకు ఎందుకు అని అంటే.. నీతో మాటలు అనవసరం అంటూ అక్కడ నుంచి వెళ్లిపోవడానికి ముకుంద రెడీ అవుతుంటే.. కృష్ణ ఒక్క నిమిషం అని చెప్పి.. నీకు ఏసీపీ సార్ అని పిలిస్తేనే కంపరంగా ఉంటె.. మరి నువ్వు మాట మాటకి నాకు మురారీ కావాలి.. నా మురారీ నా భర్త అని నువ్వు రాసావు.. అది నేను చదివి నప్పుడు నాకు ఎంత కంపరంగా ఉండాలి అని అంటుంది కృష్ణ.. నువ్వు రాసింది నాకు ఎలా తెలిసిందని షాక్ అయ్యావా .. అంటూ నేనే చదివా అంటూ ఆ చీటీని మార్చేసింది చెప్పి.. మార్చిన చీటీని చూపించి చింపేస్తుంది కృష్ణ.
మంచి కోసం చంపడానికి వెనుకాడను
నాకు ఎవరైనా సరే నీతులు చెప్పడానికి ట్రై చేస్తే నాకు చిరాకుగా ఉంటుంది. నీ హద్దుల్లో ఉండు.. నిన్న కాకా మొన్న వచ్చావు.. ఏమి చేస్తావు చంపుతావా అని ముకుంద కృష్ణని అడిగితె… మంచి చెయ్యడానికి దానికి కూడా వెనుకాడనేమో అని అంటుంది కృష్ణ. గుర్తు పెట్టుకో అని అంటూ చింపిన చీటీ ముక్కలను పడేసి వెళ్ళిపోతుంది.
మురారీని టెన్షన్ పెట్టిన కృష్ణ
మురారీ ఫోన్ లో మాట్లాడుతుంటే.. ఏమైంది కృష్ణ అని మురారీ అడిగితె.. ఏమైంది కృష్ణ .. ఏ టెన్షన్ పడడం చూడలేదు.. అని అడుగుతూనే ముకుంద విషయం ఏమైనా తెలిసిందా అని ఆలోచిస్తూ.. హాస్పటల్ లో ఏమైనా జరిగిందా అని అందుగుతాడు మురారీ..నేను లీవ్ లో ఉన్నాను.. నాకు అక్కడ ఏమి జరిగిందో ఎలా తెలుసు.. అని కృష్ణ ఇప్పుడు నా జీవితం ఎమౌంతుందో అని భయంగా ఉంది అని అంటుంది కృష్ణ.. భగవంతుడుగా ఇప్పుడు కృష్ణను ఏమి చెప్పి కన్విన్స్ చేయాలి అనుకుంటాడు కృష్ణ.. చూశారా నన్ను చూసి మీరు కూడా టెన్షన్ పడుతున్నారు. నాకు ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పండి అని అంటుంటే.. అమ్మని రమ్మనమని పిలిచి కృష్ణకు సర్ది చెప్పమని చెప్పాలి అనుకుంటుంటే.. కొంచెం వాటర్ ఇవ్వమని అడుగుతుంది. ఇందాక నేను కారిడార్ లో ముకుందని చూశాను అని అంటూ ..
రేపటి ఎపిసోడ్ లో
ముకుంద దగ్గరకు వచ్చిన మురారీ.. అందరూ కింద ఉన్నారు వెళదాం పద అని అంటే.. వాళ్ళు అందరు నాకు ఎందుకు.. నాకు నువ్వు కావాలి.. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో తెలుసా.. నీ కోసం.. నాకు నువ్వు కావాలి అని అంటుంటే.. అది ప్రభాకర్ వింటాడు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..