Krishna Mukunda Murari, 28th August: కృష్ణపై తన ప్రేమని బయటపెట్టిన మురారీ.. కృష్ణ జ్ఞాపకాలు చెరిపేస్తానంటున్న ముకుంద.. నేటి ఎపిసోడ్‌లో సూపర్ ట్విస్ట్..

ప్రేమించిన ప్రియురాలికి, పెళ్ళి చేసుకున్న భార్యకు నలిగిపోతున్న ఓ యువకుడి కథతో సాగుతున్న కృష్ణ ముకుంద మురారీ  బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. అగ్రిమెంట్ పూర్తి కానున్న నేపథ్యంలో మెడికల్ క్యాంప్ కు వెళ్లి ఇక తిరిగి రాను అని చెప్పిన కృష్ణ.. దగ్గరకు వెళ్లిన మురారీ..  ముకుంద ప్రేమించి న యువకుడు ఎవరో తెలుసుకుని పెళ్లి చేయాలనుకుంటున్న భవానీ .. 

Krishna Mukunda Murari, 28th August: కృష్ణపై తన ప్రేమని బయటపెట్టిన మురారీ.. కృష్ణ జ్ఞాపకాలు చెరిపేస్తానంటున్న ముకుంద.. నేటి ఎపిసోడ్‌లో సూపర్ ట్విస్ట్..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Aug 29, 2023 | 7:55 AM

పెళ్లి చేసుకున్నా తొలి ప్రేమని మరచిపోను అంటూ తాను ప్రేమించిన వాడిని దక్కించుకోవాలనుకుంటున్న ముకుంద.. పెళ్లి చేసుకున్న కృష్ణ తన భార్యగా జీవితాంతం ఉండాలని కోరుకుంటున్న మురారీ.. తాను పెళ్లి చేసుకున్న ఏసీపీ సార్ మనసులో తాను లేను అనుకుని ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్న కృష్ణ.. డిఫరెంట్ కథ, కథనంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కృష్ణ ముకుంద మురారీ సీరియల్ లో నేటి ఎపిసోడ్ ఆగష్టు 28వ తేదీ లో ఏమి జరగనుంది.. కృష్ణ మురారీల జీవితం ఏ మలుపు తిరగనుంది తెల్సుకుందాం..

మురారీ క్యాంప్ దగ్గరకు వచ్చిన రేవతికి .. పిల్లాడిని మంటల నుంచి కాపాడే ప్రయత్నంలో మురారీకి జరిగిన యాక్సిడెంట్ గురించి కృష్ణ తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాల గురించి తెలుసుకుంటుంది. కృష్ణ ను క్యాంప్ అయిపోయింది కదా ఇంటికి తిరిగి రమ్మనమని పిలిస్తే.. ఏసీపీ సార్ మనసులో నేను లేను.. అని అనుకుంటూ తిరిగి రాలేను అని రేవతి కి చెబుతుంది.

మర్నాడు శిబిరం నుంచి కృష్ణ తన స్వగ్రామం వెళ్ళడానికి రెడీ అవుతుంది.. మరోవైపు రేవతి ఆందోళనతో ఉంటె.. అక్కడికి మురారీ వచ్చి అమ్మ కృష్ణ ఎక్కడ అంటే.. మీది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా.. నిజమైన పెళ్లి కాదు కదా అంటుంటే.. అమ్మ నువ్వు ఏమిటి ఇలా మారిపోయావు.. అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని మురారీ బాధగా అడుగుతుంటే.. ఇంకేమీ మాట్లాడాలని అసలు మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేనిది నేను ఎన్నాళ్ళు మిమ్మల్ని బలవంతంగా కలపగలను.. ఎన్నాళ్లు కాపుగయగలను అని మురారీని ప్రశ్నిస్తుంది.. నువ్వు అలా మాట్లాడకమ్మా ఎందుకు ఇలా మారిపోయావు.. మేము ఇద్దరం బాగుండాలని నువ్వు ఎన్ని పూజలు, హోమాలు చేయించావు అని మురారీ తల్లిని అడుగుతాడు.

ఇవి కూడా చదవండి

మీరు బాగుండాలని.. ఎప్పటికి కలిసే ఉండాలని నేను కోరుకున్నది మీకు తెలియదు.. నేను ఎన్ని చేసినా కూడా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఎన్నాళ్లు కలిసి ఉంటారు.. మీకు కావాల్సింది విడిపోయి.. ఎవరికి వారు విడిగా బతకాలనే కదా.. పోయి ఎవరికీ వారు మీ ఇష్టం వచ్చినట్లు బతకండి అంటూ రేవతి కన్నీరు పెట్టుకుంటుంది.

నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోతున్నా కానీ నీ బాధ నాకు అర్ధం అవుతుంది.. గుండెల మీద చెయ్యి వేసుకుని నిజం చెబుతున్నా.. నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం.. అని చెబుతాడు తల్లికి. ఇష్టం మాత్రమే కాదు నాకు కృష్ణ అంటే ప్రాణం .. తను నాకు ఎక్కడ దూరం అవుతుందో అని భయపడుతున్నా.. అనుక్షణం చచ్చిపోతున్నా అంటూనే అసలు నేను ఇక్కడ క్యాంప్ కి ఎందుకు వచ్చానో తెలుసా.. అని మురారీ తల్లిని అడుగుతూ తాను కృష్ణ కోసం ఇక్కడ డ్యూటీ వేయించుకున్నట్లు చెబుతాడు మురారీ..

తన కొడుకు ప్రేమ గురించి తెలుసుకుని రేవతి సంతోషపడుతుంది.. తనకు నా ప్రేమ విషయం చెప్పేద్దామని అనుకునే లోపే చావు వరకూ వెళ్లి వచ్చానమ్మా అంటుంటే.. నాన్న నీకు ఏమి కాదు.. అంటుంది రేవతి.. ఇప్పటి వరకూ ఏమి కాలేదమ్మా కృష్ణ నన్ను విడిచి వెళ్ళిపోతే.. నా ప్రాణం పోతున్నట్లు అనిపిస్తున్నదమ్మా.. నాకు కృష్ణ కావాలమమ్మా.. తాను లేకుండా బతకలేను.. నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు.. నాకు కృష్ణ కావాలి అంతే అని మురారీ తల్లికి చెబుతాడు.

మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అయినా కృష్ణ మేడలో తాళికట్టాను కదా తాళికి ఎలాంటి విలువ ఉండగా.. కృష్ణ నా భార్య.. అంటుంటే రేవతి నవ్వుతుంది.. దీంతో అమ్మా నేను బాధపడుతుంటే నీకు కామెడీగా ఉందా ని సీరియస్ అవుతాడు.. పిచ్చోడా నాకు తెలుసురా.. నీకు కృష్ణ అంటే ఇష్టమని.. కానీ నేను చెబితే లేదు.. నమ్మారా.. ఒప్పుకున్నారా లేదు.. ఇవే మాటలు.. నీ మాంగళ్య ధారణ రోజు చెబితే ఏమన్నావు.. నువ్వు ఇష్టం వేరు.. ప్రేమ వేరు అనలేదా అని కొడుకుని ప్రశ్నిస్తుంది రేవతి. నేను ఎలా వెళ్లనిస్తాను అనుకున్నావు దానిని.. కృష్ణ మన ఇంట్లో అడుగుపెట్టినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను.. తన కోసం సాక్ష్యాత్తు మీ పెద్దమ్మనే ఎదిరించాను నేను  తనని ఇప్పుడు ఎలా వెళ్లనిస్తాను అని కొడుక్కి చెబుతుంది రేవతి. మూడు గంటల సినిమా ఇది.. అయిపోగానే వెళ్లిపోవడనికి అంటే.. రేవతి దేవి ఈజ్ బ్యాక్.. నాకు ఏమి కావాలో నీకు ఒక్కదానికే తెలుసమ్మా అంటూ తల్లిని హత్తుకుంటాడు.

కృష్ణ ఊరు వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటుంది.. ఏసీపీ సార్ లేచారా.. ఆయనకి ఇప్పుడు ఎలా ఉందొ.. తగ్గింది కదా బాగానే ఉంటారు.. రేవతి అత్తయ్య ఉన్నారు కదా చూసుకుంటారులే.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా నేను గుర్తుకు రాలేదా..  అనుకుంటుంటే..

కృష్ణ ఏసీపీ సార్ అంటూ ఎగురుకుంటూ వస్తుంది.. అంటే.. కృష్ణ మొండితనం గురించి నీకు తెలియదమ్మా.. ఒకవైపే చూసావు అంటే.. నీ భార్యరా తాను చచ్చేదాకా నీతోనే ఉంటుంది అని రేవతి చెబుతుంది. అని మనం అనుకుంటే కాదుకమ్మా.. తాను వేరు.. కృష్ణ అందరిలాంటి అమ్మాయి కాదురా మొండిది..  తాను తింగరి.. తన ప్రేమ ఆకాశం.. కోపం ప్రళయం.. బాధ సముద్రం.. మనం తప్ప తనకు ఎవరున్నారు.. కృష్ణకు తల్లైనా, తండ్రైనా.. స్నేహితుడైనా అన్నీ నువ్వేరా .. అంటునే.. ముకుంద మీద భయంతో అడుగుతున్నా.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీరిద్దరూ కలిసే ఉండాలి అంటే.. కలిసే ఉంటామని చెబుతాడు.. అయినా తను మనతో రావాలి కదా అంటుంటే.. ఏమిటి నా మీద ఇంకా నమ్మకం లేదా అని ప్రశ్నిస్తుంది కొడుకుని రేవతి.

కృష్ణ మాట అంటే మాటే.. పంతం వదలదు.. అంటే కృష్ణ రాకపోతే మురారి ఏమైపోతాడో అనుకుంటే.. కృష్ణ వస్తుంది.. టిఫిన్ తీసుకొస్తా లోపలికి వెళ్లి కూర్చో అని అంటుంది..

కృష్ణ ఏడుస్తూ ఉంటుంది.. రేవతి కృష్ణను వెదుకుతూ కృష్ణ దగ్గరకు వెళ్తుంది.. గుడ్ మార్కింగ్ అత్తయ్య కాఫీ ఇస్తాను.. మీకు చెప్పి వెళదామని అనుకుంటున్నా.. ఏసీపీ సార్ లేచారా.. టాబ్లెట్స్ వేసుకున్నారా.. అని అంటూనే.. మా అగ్రిమెంట్ ఎప్పుడు ఎప్పుడు అయిపోతుందాని ఎదురుచూస్తున్నారు.. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని నా ప్రేమని ఎలా గుర్తిస్తారు అని అనుకుంటే.. చీర కట్టుకో అంటుంది.. ఇంతలో ఫోన్ మోగితే బాబాయ్.. వస్తున్నా.. అంటే.. రేవతి ఫోన్ తీసుకుని కృష్ణ ఎక్కడికి రాదు.. మా ఇంటికి వస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

సరే కృష్ణ నువ్వు మా ఇంటికి రాకపోతే.. మేమె మీ ఇంటికి వస్తాం.. మీ ఇంటికి మన ఇంటికి అంటే.. అత్తయ్యకు ఏసీపీ సార్ ప్రేమ విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటుంది కృష్ణ. నేను వెళ్లిపోవడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నారు.. దయచేసి అర్ధం చేసుకోండి అంటే.. అయినా సరే మనం మన ఇంటికే వెళ్తున్నాం.. పదా చీర కట్టుకో అంటే.. రావాలి ఉన్నా నేను రావడం లేదు.. మిమ్మల్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అనుకుంటుంది కృష్ణ.

వాడు చెప్పింది కరెక్ట్. ఇది కూడా బయటపడుతుంది అనుకున్నా.. కానీ జగమొండి.. అనుకుంటూనే వాడికి బాగోలేదు.. భార్యగా, డాక్టర్ గా నువ్వు పక్కన ఉండాలి కదా అని రేవతి అంటే.. అత్తయ్య ఆయనకు బాగానే ఉంది.. ఇక నేను వెళ్ళిపోతేనే అయన మనశాంతిగా ఉంటారు అని కృష్ణ చెబుతుంది. వాడి మనసులో తనకు స్థానం లేదు అనుకుంటుంది ఓయ్ తింగరి దానా .. ఇన్నాళ్లు వాడిని అర్ధం చేసుకుంది ఇంతేనా.. ముందు చీర కట్టుకుని బయలు దేరు అంటే.. కృష్ణ కోపంతో అత్తయ్య నేను ఆయన మనసులో లేను.. ఇందుకా నువ్వు వెళ్తాను వెళ్తాను అనేది.. పిచ్చిదానా వాడు ప్రేమించి నిన్నేనే ఇంకెవరినో కాదు.. నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని వాడు కుములిపోతున్నాడు కృష్ణ.. అంటే మీరు నిజం చెబుతున్నారా అంటే.. ఈ విషయంలో కూడా అబద్ధం చెబుతారా అని అంటుంది కృష్ణ.. అసలు ఈ క్యాంప్ కు వచ్చిందే వాడి ప్రేమని నీకు చెప్పడానికి అంటుంది రేవతి.

నీకు వాడి ప్రేమని ఎలా చెప్పాలో అర్ధం కాక చచ్చిపోతున్నాడు అంటే.. కానీ అత్తయ్య ఏసీపీ సార్ ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాడు.. అవన్నీ నాకు తెలియదు కృష్ణ.. ఇప్పుడే నాకు చెప్పాడు.. నిన్నే ప్రేమిస్తున్నా అని చెప్పడు.. వాడి మనసులో నువ్వే ఉన్నావు కృష్ణ అంటే.. కృష్ణకు పట్టరాని సంతోషం కలుగుతుంది. చిన్నపిల్లలా అత్తగారితో ఆడుకుంటుంది. నువ్వు ఇంటికి వచ్చాకా అన్నివిషయాలు నీకు క్లియర్ గా అర్ధం అవుతుంది అంటుంటే.. అత్తయ్య మాతో బలవంతంగా పూజలు హోమాలు చేయించినట్లు.. ఏసీపీ సార్ గురించి కూడా అబద్ధం చెప్పిందేమో అని మళ్లీ కృష్ణ మనసులో అనుమానం కలుగుతుంది. ఏసీపీ సార్ తన ప్రేమ విషయాన్నీ నాతో ఎందుకు చెప్పలేదు.. సిగ్గు , బెట్టా అని అంటుంది..

రేపటి ఎపిసోడ్ లో..

మురారీ రూమ్ లో ముకుంద తన ప్రేమకు సంబంధించిన ఫోటోలు పెడుతుంటే.. ఈ గదిలో కృష్ణ వదిలిన ఊపిరికూడా ఉండకూడదు.. నా ప్రేమతో అవన్నీ చెరిపేస్తా అనుకుంటూ మురిసిపోతుంది…

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..