Kiara Advani : మాస్ మహారాజ్‌ మూవీకి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోన్న కియారా..!

Kiara Advani : మాస్ మహారాజ్‌ రవితేజ హిట్టు, ప్లాపులతో పనిలేదు. గతంలో సంవత్సరానికి 3 సినిమాలు సాలిడ్‌గా డెలివర్ చేసేవాడు. అయితే వరస పరాజయాలు ఈ మాస్ హీరోని కృంగదీశాయి. అందుకే ఏడాదికి రెండు సినిమాలతోనే సరిపెట్టేస్తున్నాడు.  ఈ ఇయర్‌లో ఇప్పటికే ‘డిస్కోరాజా’ తో డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజ్.. త్వరలోనే ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయ్యాక..రమేశ్ వర్మతో ఓ మూవీకి కమిటయ్యాడు […]

Kiara Advani : మాస్ మహారాజ్‌ మూవీకి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోన్న కియారా..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 17, 2020 | 10:16 AM

Kiara Advani : మాస్ మహారాజ్‌ రవితేజ హిట్టు, ప్లాపులతో పనిలేదు. గతంలో సంవత్సరానికి 3 సినిమాలు సాలిడ్‌గా డెలివర్ చేసేవాడు. అయితే వరస పరాజయాలు ఈ మాస్ హీరోని కృంగదీశాయి. అందుకే ఏడాదికి రెండు సినిమాలతోనే సరిపెట్టేస్తున్నాడు.  ఈ ఇయర్‌లో ఇప్పటికే ‘డిస్కోరాజా’ తో డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజ్.. త్వరలోనే ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయ్యాక..రమేశ్ వర్మతో ఓ మూవీకి కమిటయ్యాడు రవితేజ.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కియారా అద్వానీని రిఫర్ చేస్తున్నాడట దర్శకుడు. ఇటీవలే ఆమెను కలిసి స్క్రిప్ట్‌కు కూడా వినిపించాడట. ఆమెకు స్టోరీ నచ్చినప్పటికి ఏప్రిల్, మే వరకు డేట్స్ లేవు..అప్పటివరకు వెయిట్ చేస్తే చేస్తానని తెలిపిందట. పనిలో పనిగా రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసిందని టాక్. అది కూడా 18 రోజుల కాల్షీట్లకు మాత్రమే. ప్రస్తుతం కియారా ఉన్న రేంజ్‌కు… ఆమె చెప్పిన అమౌంట్‌కు దర్శకుడు పెద్దగా షాకవ్వలేదని సమాచారం. కియారా-రవితేజ కెమిస్ట్రీ అయితే తన స్క్రిప్ట్‌కు కొత్తగా ఉంటుందని రమేశ్ వర్మ ఫీల్ అవుతున్నాడట. సినిమా ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉన్న నేపథ్యంలో..ఆయన మరికొన్ని ఆప్షన్స్‌ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి-మహేశ్ బాబు సినిమా కోసం కియారాను సంప్రదించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి : నితిన్, నిఖిల్ ఒకే రోజు పెళ్లిపీటలెక్కనున్నారు..!