Tollywood : అప్పుడు ఒకే సినిమాలో..ఇప్పుడు ఒకే పాత్రలో..

Tollywood : నటసింహం నందమూరి బాలయ్య, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గతంలో ‘ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా’ మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తాజాగా వీరిద్దరూ ఒకే మూవీలో కాదు గానీ..ఒకే తరహా పాత్రలో కనిపించబోతున్నారని ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. అది కూడా అఘోరా వేషంలో. ప్రజంట్ బాలయ్య ..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రెండు గెటప్పుల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. […]

Tollywood : అప్పుడు ఒకే సినిమాలో..ఇప్పుడు ఒకే పాత్రలో..
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 17, 2020 | 1:04 PM

Tollywood : నటసింహం నందమూరి బాలయ్య, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గతంలో ‘ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా’ మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తాజాగా వీరిద్దరూ ఒకే మూవీలో కాదు గానీ..ఒకే తరహా పాత్రలో కనిపించబోతున్నారని ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. అది కూడా అఘోరా వేషంలో. ప్రజంట్ బాలయ్య ..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రెండు గెటప్పుల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి అఘోరా పాత్ర అని సమాచారం. బాలయ్య గుండు చేయించుకుంది కూడా ఆ పాత్ర కోసమేనట. ఇక ఈ మూవీలో  బాలయ్యను బోయపాటి ఏ రేంజ్‌లో చూయిస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానే వెయిట్ చేస్తున్నారు.

ఇక మంచు మనోజ్ కూడా కాస్త డిఫరెంట్ హీరో. ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించాలని ఆరాటపడుతూ ఉంటారు. వివిధ కారణాల వల్ల దాదాపు 3 ఏళ్ల పాటు సినిమాలకు దూరమైన మనోజ్.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీని రిసెంట్‌గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో మంచువారబ్బాయి అఘోరాగా దర్శమివ్వనున్నాడనే టాక్ నడుస్తోంది. ప్రజంట్ బాలకృష్ణ సినిమా షూటింగ్ వడివడిగా జరుగుతుండగా..మనోజ్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏది ఏమైనా పాత్రకు ప్రాధాన్యమిస్తూ మన కథానాయకులు ముందుకు వెళ్లడం మంచి పరిణామమే. కాగా ఈ రెండు సినిమాలు కూడా రోజుల వ్యవధిలోనే రిలీజ్ కావచ్చని తెలుస్తుంది. మరి అఘోరాగా ఈ ఇద్దరు హీరోలు ఎలా మెస్మరైజ్ చేస్తారో చూడాలి.

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..