RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతోన్న ఆ దర్శకులు..!

RRR movie news: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఈ సినిమాలో మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు ఈ మూవీలో అజయ్ దేవగన్, సముద్ర ఖని, అలియా భట్ తదితరులు భాగం అవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై అందరిలోనూ అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. అంతేకాదు రాజమౌళి ముందు చిత్రం బాహుబలి దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ […]

RRR Movie: 'ఆర్ఆర్ఆర్‌' ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతోన్న ఆ దర్శకులు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 9:02 AM

RRR movie news: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఈ సినిమాలో మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు ఈ మూవీలో అజయ్ దేవగన్, సముద్ర ఖని, అలియా భట్ తదితరులు భాగం అవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై అందరిలోనూ అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. అంతేకాదు రాజమౌళి ముందు చిత్రం బాహుబలి దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. మిగిలిన ఇండస్ట్రీల్లోనూ ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా షూటింగ్‌లో ఆలస్యం అవ్వడం వలన ఈ మూవీ విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో ఆర్ఆర్ఆర్ అదే రోజున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదల నేపథ్యంలో.. అదే సమయానికి రావాలనుకున్న కొంతమంది దర్శకులు తమ సినిమాలను వాయిదా వేయాలనుకుంటున్నారట. బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను దృష్టిలో పెట్టుకున్న వారు.. ఆర్ఆర్ఆర్‌కు పోటీ ఉండకపోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నట్లు టాక్. అందుకే తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే అక్కడ పరిస్థితి అలా ఉంటే.. టాలీవుడ్‌లో మాత్రం మరోలా ఉంది. వచ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్‌కు పోటీగా పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగార్జున తదితరులు బరిలో ఉండబోతున్నట్లు సమాచారం. కానీ వారి చిత్రాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్, చెర్రీ ఫస్ట్‌లుక్‌లు వారి వారి పుట్టినరోజు నాడు రాబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.