Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam Serial : హిమ కోసం బయలుదేరిన మోనిత.. దీప ఆచూకీ ఎవరికి ముందు తెలుస్తుంది.. మురళీ కృష్ణకా.. మోనితకా ..!

కార్తీక దీపం తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ కు దగ్గరగా ప్రసారం అవుతున్నా ఏ మాత్రం ప్రేక్షకుల ఆదరణ తగ్గడం లేదు.. నేటికీ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది...

Karthika Deepam Serial : హిమ కోసం బయలుదేరిన మోనిత.. దీప ఆచూకీ ఎవరికి ముందు తెలుస్తుంది.. మురళీ కృష్ణకా.. మోనితకా ..!
Karthika Deepam Today
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2021 | 10:50 AM

Karthika Deepam Serial : కార్తీక దీపం తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ కు దగ్గరగా ప్రసారం అవుతున్నా ఏ మాత్రం ప్రేక్షకుల ఆదరణ తగ్గడం లేదు.. నేటికీ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. అంతగా ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం ఈరోజు 993 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ను చూద్దాం..!

మోనిత కార్తీక్ ను దక్కించుకోవడం ప్లాన్ చేస్తూ.. అన్నీ తనకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి .. ఎదో జరగాలి అంటూ ఆలోచిస్తూ.. కార్తీక్ మళ్ళీ పరీక్ష చేయించుకోవడం గుర్తు చేసుకుంటుంది. ఏదోకటి చేసి కార్తీక్ ను దక్కించుకోవాలని.. ఎంతకైనా తెగిస్తాను అంటూ.. బట్టలు సర్దుకోవడం మొదలు పెడుతుంది. ఇక కార్తీక్ .. సౌందర్య దగ్గరకు వచ్చి.. మమ్మీ నీతో మాట్లాడాలి ఒక్కసారి పైకి రమ్మనమని అడగుతాడు.. దీంతో ఆనందరావు నేను కూడా వస్తాను సౌందర్య అని అంటాడు.. పైకి ఎందుకు రావడం అని వారిస్తుంది. ఇంతలో ఆదిత్య కలుగజేసుకుని.. అతిగా ఆలోచించి ఇంతవరకూ తెచ్చుకున్నావు.. అని తండ్రీకొడుకులు వాదించుకుంటుంటే.. మీరు ఆపుతారా అంటూ సౌందర్య వారిస్తుంది. నా గుండెల్లో దడగా ఉంది అంటూ పైకి వెళ్తుంది.

మురళీ కృష్ణ తన కూతురు దీప గురించి ఆలోచిస్తూ..ఇక కనిపించవా.. అలసిపోయావా.. నువ్వు ఎలా నాకు దొరికేది అంటూ కంటనీరు పెడతాడు.. ఇవాళ ఇంకా గిరాకీ పెరిగింది అక్కా.. ఇలా నడిస్తే.. బండి తీసేసి.. షెడ్ వేయాలి ఏమో అంటూ.. శౌర్య తెలివితేటల వల్లనే ఇదంతా.. అంటాడు..అవును అవన్నీ మా అత్తగారి తెలివితేటలే అని సంతోషపడుతుంది.. అవును అంటూ వారణాసీ.. నువ్వు డాక్టర్ బాబు కలిసి ఉంటె.. వారిద్దరూ మంచి చదువులు చదువుకునేవారు.. అంటూ పిల్లలు వాళ్ళ నాన్నకు బెంగపెట్టుకుంటున్నారు అని అంటుంటే.. ఇంతలో శౌర్య వారణాసిని వారిస్తుంది. నీ మాటలు మా అమ్మ నమ్మేసి.. మమ్మల్ని నీతో నాన్నదగ్గరకు పంపిస్తే.. అంటుంది.. మాకు నువ్వు కావాలి.. నాన్న కావాలి.. కానీ నాన్న నువ్వు వద్దు..మేమె కావాలి అంటే.. నిన్ను వదిలేసి వెళ్ళం అంటూ కన్నీరు పెడతారు.. మీ ప్రేమే మీ నాన్నని తీసుకొస్తుంది అంటుంది దీప.. ఇక మరోవైపు కార్తీక్ లో అంతర్మధనం మొదలవుతుంది.. అయితే మళ్ళీ దీపని తప్పుగానే ఆలోచిస్తాడు.. నేను దీపని వెళ్ళమన్నాను.. పిల్లలని తీసుకుని వెళ్ళమని చెప్పలేదు.. అంటాడు.. పిల్లని వదిలేసి ఎలా తల్లివెళ్ళుతుంది అంటే.. తండ్రి లేకుండా పిల్లలు పుట్టలేదా అంటే.. సౌందర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం. పుట్టగతులుండవు.. నేను సంస్కార హీనుడిని కన్నానా అంటూ జీవితాంతం కుమిలిపోయేలా చేయకు కార్తీక్ అంటూనే.. ఎందుకు పిలిచావో చెప్పు అని సౌందర్య అంటుంది. ఆదిత్య మాటల్లో నిజం ఉందనిపిస్తుంది.. నేను టెస్టులు చేయించుకుంటే.. రిజల్ట్ వేరేగా వస్తే.. హిమనీ దూరంగా పెట్టారుగా అంటాడు.. ఒరేయ్ కార్తీక్ మోనిత మళ్ళీ వద్దందా.. అంటుంటే.. మోనిత ఇటువంటి మాటలు చెప్పదు..నేను చెప్పుడు మాటలను వినని తెలుసు.. అంటాడు.. టెస్టులు చేయించుకుంటే నీ భయపడేవి ఏవీ జరగవు.. నన్ను నమ్ము అంటూ సముదాయిస్తుంది. నమ్మకాలూ నిజాన్ని శాసిస్తాయి.. మమ్మీ నా నమ్మకమే నిజమైతే.. హిమనీ దూరం పెట్టేస్తారు.. అంటుంటే.. సౌందర్య టెస్టులు చేయించుకో.. రిజల్ట్ ఎలా వచ్చినా హిమ నా వంశాంకురంలానే పెరుగుతుంది.. అంటుంటే.. దీప అన్ని విషయాల్లోనూ నచ్చుతుంది.. ఒక్క ఇది ఒక్కటే లేకపోతె.. ఎంత బాగుండును.. మీ నమ్మకమే నిజమైతే.. నేను దీప కాళ్ళు కూడా పట్టుకోవడానికి వెనుకాడను అంటాడు.. సౌందర్య టెస్టులు చేయించుకో అంటూ. బతిమాలుతోంది. మోనిత ఇంతలో బట్టలు సద్దుకుంటూ.. ప్రియమణి ని పిలిచి నేను ఊరువెళ్తున్నా.. కార్తీక్ వస్తే.. హిమనీ తీసుకుని రావడానికి వెళ్లిందని చెప్పు అంటుంది.. మరోవైపు దీపకు బాగా దగ్గు వస్తుంది.. భగవంతుడా నాకు ఏమైనా అయితే నా బిడ్డలు అనాథలు అయిపోతారు.. అంటూ నా ఆరోగ్యం బాగుండాలి .. నాకు ఏమీ కాకుండా చూడు అంటూ వేడుకుంటుంది.. .. మరి కార్తీక్ టెస్టులకు వెళ్తాడా.. మురళీ కృష్ణ కు , మోనిత ల్లో మొదట ఎవరికీ దొరుకుంటుంది దీప జాడ తెలుసుకోవాలంటే.. రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే..!

Also Read: బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. సేవింగ్స్‌ అకౌంట్‌ లిమిట్ ఎంతో తెలుసా.. ట్యాక్స్‌ పడకూడదంటే తెలుసుకోండి..

ఐఫోన్‌తో ఛార్జర్ ఇవ్వకపోవడంతో ఆపిల్ సంస్థకు భారీ జరిమానా.. ఎంత వేశారంటే.!