Suma Kanakala Birthday: కేరళలో పుట్టి.. తెలుగింటి ఆడపడుచుగా ఆదరణ సొంతం చేసుకున్న క్వీన్ ఆఫ్ యాంకర్స్
తెలుగు మాతృబాష కల్గిన యాంకర్స్ కూడా తెలుగు మాట్లాడడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో.. కేరళ కుట్టి.. సుమ మాత్రం గలగలా తెలుగు మాట్లాడుతూ.. బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన..
suma kanakala birthday what makes kerala malayalee suma the best telugu anchor: తెలుగు మాతృబాష కల్గిన యాంకర్స్ కూడా తెలుగు మాట్లాడడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో.. కేరళ కుట్టి.. సుమ మాత్రం గలగలా తెలుగు మాట్లాడుతూ.. బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన యాంకర్ గా మారిపోయింది. సుమ పుట్టిన రోజు నేడు.. సుమ కనకాల మార్చి 22 వ తేదీ 1974న జన్మించింది. సుమ మలయాళీ అమ్మాయి. అయినప్పటికీ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉండడంతో.. తెలుగు భాషపై పట్టుసాధించింది.
కేరళకు చెందిన సుమ మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు, బుల్లి తెర యాంకరింగ్ చేస్తూ టాప్ యాంకర్ గా గత కొన్నేళ్లుగా కెరీర్ లో దూసుకుపోతుంది.
చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తి కలగలసిన సుమ ఈ రంగంలో ఎవరూ అందుకొలేని స్టేజ్ కు చేరుకుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి షో లకు యాంకరింగ్ చేస్తూనే.. పలు లైవ్ షో లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ.. తనదైన శైలీలో అలరిస్తుంది సుమ కనకాల
అవును సుమ గత కొన్నేళ్లుగా బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. గలగలా మాట్లాడుతూ.. తన మాటల గారడితో ప్రేక్షకుల మనసులను దోచినుకున్న సుమ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. బుల్లి తెరపై యాంకర్స్ ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చింది సుమ. యాంకర్, వ్యాఖ్యాత.. నిర్మాత, సుమ కనకాల మల్టీటాలెంటెడ్ పర్సన్. క్వీన్ ఆఫ్ థ యాంకర్స్ అని ఖ్యాతిగాంచింది.
ఇలాంటి యాంకర్ మళ్ళీ తెలుగు బుల్లి తెరపై చూస్తామా అనే రీతిలో సుమ ఫేమ్ సంపాదించుకుంది. సుమ పాతికేళ్ల కెరీర్‌లో ఆమెతో పాటు వచ్చిన వారందరూ దాదాపు కనుమరుగైపోయారు. కానీ ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. బుల్లి తెరపై నెంబర్ 1 యాంకర్‌గా హవా కొనసాగిస్తూనే ఉంది. సుమ మంచి వ్యాఖ్యాత మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్, నటి, సింగర్ విషయం అన్న సంగతి తెలిసిందే..
బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటి టాప్ యాంకర్.. తాను చిన్నతనంలో క్లాసికల్ డ్యాన్స్, సంగీతం నేర్చుకున్నానని సుమ చాలా సార్లు ప్రేక్షకులతో తన చిన్నతనం రోజులను పంచుకుంది.. వాస్తవానికి సుమ బుల్లి తెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది.. కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడు లో ఎంట్రీ ఇచ్చింది. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో నటిస్తున్న సమయంలో రాజీవ్ కనకాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.. సుమ రాజీవ్ పెళ్లి 1999, ఫిబ్రవరి 10న జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు.
ఇక సుమ ఇటీవల గాయనిగా కూడా మారింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఓ సినిమా లో అనసూయ స్పెషల్ సాంగ్ కి డ్యాన్స్ చేయగా సుమ ఆ పాటను పాడింది. తమన్ ఆమెతో పాడించాడు. యాంకర్ గా ఎంతో ఎత్తు చేరుకున్న సుమ కనకాల ఇటువంటి పుట్టిన రోజులు అనేకం చేసుకోవాలని కోరుకుంటూ.. టివి 9 పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతుంది.
View this post on Instagram
Also Read: దేశంలో తీవ్రస్థాయికి చేరిన కరోనా ఉద్ధృతి.. 46 వేలకుపైగా పాజిటివ్ కేసులు, 212 మరణాలు..