Tollywood: తల్లితో ఉన్న ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. బుల్లితెరపై తిరుగులేదంతే
పై ఫొటోలో తల్లితో కలిసి సూటు బూటు వేసుకుని పోజులిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్.. ఇలా అన్నింటా తన సత్తా చాటుతున్నాడు. చాలా మంది లాగే ఈ అబ్బాయి ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా కెరీర్ ను ప్రారంభించాడు. మహేశ్ బాబు, రవితేజ, బాలకృష్ణ తదితర టాప్ హీరోల సినిమాల్లో బాల నటుడిగా నటించి మెప్పించాడు.
పై ఫొటోలో తల్లితో కలిసి సూటు బూటు వేసుకుని పోజులిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్.. ఇలా అన్నింటా తన సత్తా చాటుతున్నాడు. చాలా మంది లాగే ఈ అబ్బాయి ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా కెరీర్ ను ప్రారంభించాడు. మహేశ్ బాబు, రవితేజ, బాలకృష్ణ తదితర టాప్ హీరోల సినిమాల్లో బాల నటుడిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ మారాడు. అయితే పెద్దగా క్లిక్ అవ్వలేపోయాడు. దీంతో బుల్లితెరపై తన అదృష్టం పరీక్షించుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా క్లిక్ అవ్వలేని ఈ హ్యాండ్సమ్ యాక్టర్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై అదరగొడుతున్నాడు. తనదైన నటనతో అందరి మనసులు మరీ ముఖ్యంగా అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నాడు. గతంలో బిగ్ బాస్ తెలుగు షోలోనూ సందడి చేసిన ఈ ట్యాలెంటెడ్ నటుడు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. మరి ఈ కుర్రాడెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు బుల్లితెర హీరో ‘మానస్ నాగులపల్లి’. అదేనండి ‘బ్రహ్మముడి’ సీరియల్ హీరో రాజ్. ఇది అతని చిన్న నాటి ఫొటో. అందులో మానస్ పక్కన ఉన్నది తల్లి పద్మినీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఇటీవల ఈ ఫొటోను పంచుకుంది. ‘ సుమారు 15 సంవత్సరాల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో నేను, మానస్’ అంటూ ఈ ఫొటోను పంచుకుంది. ఇందులో ఎంతో హ్యాండ్స మ్ గా కనిపించాడు మానస్.
ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోన్న మానస్ తాజాగా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. మంగళవారం (సెప్టెంబర్ 10) ఉదయం తన సతీమణి శ్రీజ నిశ్వంకర పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని మానస్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. బేబీ బాయ్ అంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మానస్, శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడాది నవంబర్ లో మానస్, శ్రీజల వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుభవార్త చెప్పారు శ్రీజ, మానస్. ఆ తర్వాత శ్రీజ బేబీ బంప్ ఫొటోలను కూడా తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మానస్. ఇటీవలే శ్రీజకు ఘనంగా సీమంతం నిర్వహించాడు. ఇప్పుడు తమ జీవితంలోకి పండంటి బిడ్డ అడుగు పెట్టడంతో ఈ దంపతుల ఆనందానికి అవధుల్లేవు.
శ్రీజ సీమంతంలో మానస్, పద్మినీ..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.