AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: ‘అతనిని గాఢంగా ప్రేమించా..పెళ్లికి కూడా రెడీ అయ్యాం.. కానీ ‘.. కిరాక్ సీత బ్రేకప్ స్టోరీ

ఎనిమిదో సీజన్ లో హౌస్ లోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్స్ లో కిరాక్ సీత ఒకరు. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఆమె బేబీ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందీ బోల్డ్ బ్యూటీ. కాగా బేబీ సినిమా అనంతరం కిర్రాక్ సీత పేరు ప్రముఖంగా వినిపించింది.

Bigg Boss Telugu 8: 'అతనిని గాఢంగా ప్రేమించా..పెళ్లికి కూడా రెడీ అయ్యాం.. కానీ '.. కిరాక్ సీత బ్రేకప్ స్టోరీ
Kirrak Seetha
Basha Shek
|

Updated on: Sep 11, 2024 | 3:16 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ గా హౌస్లో అడుగుపెట్టగా ఆదివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 13 మంది మాత్రమే ఉన్నారు. కాగా ఎనిమిదో సీజన్ లో హౌస్ లోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్స్ లో కిరాక్ సీత ఒకరు. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఆమె బేబీ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందీ బోల్డ్ బ్యూటీ. కాగా బేబీ సినిమా అనంతరం కిర్రాక్ సీత పేరు ప్రముఖంగా వినిపించింది. వరుసగా ఇంటర్వ్యూలకు కూడా హాజరైంది. ఇదే సందర్భంలో తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలామందిలాగే సీతకు కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందట. ‘నా లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. అందుకే బేబీ మూవీ నాకు కనెక్ట్ అయిందేమో! ఐదేళ్ల పాటు నేను ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. ప్రేమ కంటే పేరెంట్స్ ముఖ్యం కదా అని నేను కూడా నా ప్రేమను వదిలేశాను. ఒకరినొకరు మోసం చేసుకోవడం లాంటివి ఏమీ లేవు’

ఇవి కూడా చదవండి

ఇక తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని కిరాక్ సీత ఓ సందర్భంలో ఓపెన్ అయ్యింది . ‘ఒక సినిమా ఆఫర్ ఉంది. రూ. 25 లక్షలు ఇస్తారు.. కాకపోతే నిర్మాతను కలవడానికి ఫామ్ హౌస్ కి వెళ్లాలి. ఫారిన్ ట్రిప్ కి కూడా వెళ్ళాలి అన్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారన్న సందేహం కలిగింది. తర్వాత నాకు విషయం అర్థమైంది. నాకు ఆఫర్ వద్దని చెప్పేశాను’ అని సీత తన చేదు అనుభవాన్ని పంచుకుంది.

అంది కిర్రాక్ సీత.

అందుకు.. 25 లక్షలు ఆఫర్ చేశారు..

కాగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో కిరాక్ సీత ఒకరు. టాస్కుల్లోనూ, గేమ్స్ లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. అలాగే మాటకు మాట బదులిస్తోంది. ఇదే బుల్లితెర ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో కిరాక్ సీత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..