Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9లోకి టాలీవుడ్ స్టార్ నటుడి సతీమణి! హౌస్‌లో వంటలక్కగా మారనుందా?
ఈసారి కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ టీమ్ వినూత్నంగా ఆలోచిస్తోంది. అగ్ని పరీక్ష కాంటెస్ట్ కూడా ఇందులో భాగమే. ఇక సెలబ్రిటీల్లోనూ ఎవరూ ఊహించని వారిని కంటెస్టెంట్లుగా హౌస్ లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో టాలీవుడ్ స్టార్ కమెడియన్ భార్య పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

బిగ్‌బాస్ ఆడియెన్స్ ఎదురు చూపులకు మరో రెండు రోజుల్లో తెర పడనుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 07)న ప్రారంభం కానుంది. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ ఎపిసోడ్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. కాగా గతంలో కంటే ఈసారి బిగ్ బాస్ లో చాలా సర్ ప్రైజ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈసారి షోలో కొత్త రూల్స్, గేమ్స్, టాస్కులు అమలు చేయనున్నారు. అందుకు తగ్గట్టుగానే ‘సిలబస్ మార్చేశాం’, ‘డబుల్ హౌస్’ అంటూ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ కొత్త సీజన్ పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్ టీమ్ మరింత వినూత్నంగా ఆలోచించింది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు హౌస్ లో అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసమే అగ్ని పరీక్ష పేరుతో సరికొత్త కాంటెస్ట్ నిర్వహిస్తోంది. కామనర్స్ సంగతి పక్కన పెడితే ఈసారి సెలబ్రిటీల విషయంలో చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని, ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీరియల్ నటి నవ్య స్వామి, ఎమ్మాన్యుయేల్, కావ్య శ్రీ, రీతూ చౌదరి ఇలా చాలామంది స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి.
అలాగే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, 7 /జి బృందావన్ కాలనీ ఫేమ్ సునీల్ శెట్టి,అలేఖ్య చిట్టి పికిల్స్, స్రవంతి సీరియల్ ఫేమ్ భరణి శంకర్, తనూజా గౌడ, ఫోక్ సింగర్ రాము రాథోడ్, సంజనా గల్రానీ, హర్షిత్ రెడ్డి ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరితో పాటు టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ సతీమణి జుబేదా అలీ పేరు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అలీ భార్యగా కాకుండా జుబేదాకు నెట్టింట ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె వీడియోలకు ఇన్ స్టా గ్రామ్ లో, యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ముఖ్యంగా జుబేదా కుకింగ్ వీడియోలకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటోంది. ఈ నేపథ్యంలో అలీ భార్య హౌస్ లోకి అడుగు పెడితే వంటలక్కగా మారిపోతుందేమో! ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
జుబేదా అలీ లేటెస్ట్ కుకింగ్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








