Brahmamudi, September 9th Episode: కోమాలో అపర్ణా.. ఇంట్లోంచి బయటకు కావ్య.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణి కలిపిన ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది అపర్ణ. అనంతరం కళ్లు తిరిగి, గుండెల్లో నొప్పి వచ్చి స్పృహ తప్పుతుంది. మరోవైపు కావ్య ఆఫీస్‌కి వెళ్తుంది. ఎన్ని సార్లు కాల్ చేసినా కావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో రాజ్‌కి కాల్ చేస్తుంది అపర్ణ. వెంటనే రాజ్ వాళ్లు గుడి దగ్గర నుంచి కంగారుగా బయలుదేరుతారు. మరోవైపు కళ్యాణ్ ఎంతో సంతోష పడుతూ ఉంటాడు. నా మీద ఎంత కోపంగా ఉన్నా.. నా పుట్టిన రోజు చేయాల్సి నవన్నీ చేసింది. దానికి ఆ దేవుడికి థాంక్స్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణి కలిపిన ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది అపర్ణ. అనంతరం కళ్లు తిరిగి, గుండెల్లో నొప్పి వచ్చి స్పృహ తప్పుతుంది. మరోవైపు కావ్య ఆఫీస్‌కి వెళ్తుంది. ఎన్ని సార్లు కాల్ చేసినా కావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో రాజ్‌కి కాల్ చేస్తుంది అపర్ణ. వెంటనే రాజ్ వాళ్లు గుడి దగ్గర నుంచి కంగారుగా బయలుదేరుతారు. మరోవైపు కళ్యాణ్ ఎంతో సంతోష పడుతూ ఉంటాడు. నా మీద ఎంత కోపంగా ఉన్నా.. నా పుట్టిన రోజు చేయాల్సి నవన్నీ చేసింది. దానికి ఆ దేవుడికి థాంక్స్ చెప్పాలని కళ్యాణ్ అంటాడు. హలో మాస్టారూ గుడికి వెళ్దామని చెప్పింది నేను. మరి దేవుడికి ఎందుకు క్రెడిట్ ఇస్తున్నావ్? అని అంటుంది అప్పూ. నీకే థాంక్స్ చెబుతున్నా.. థాంక్యూ అని అంటాడు కళ్యాణ్. మరోవైపు రాజ్ వాళ్లు ఇంటికి వచ్చే సరికి అపర్ణ కింద పడిపోయి ఉంటుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తారు.
కోమాలోకి వెళ్లారు.. ఇప్పుడే ఏమీ చెప్పలేం..
ఆస్పత్రిలో అందరూ కంగారు పడుతూ ఉంటారు. డాక్టర్ అపర్ణను చెక్ చేస్తూ ఉంటుంది. అసలు వదినను వదిలేసి కావ్య ఎక్కడికి వెళ్లింది? అని ప్రకాశం అంటాడు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా.. ఎక్కడికి వెళ్లింది.. అని రాజ్ ఆవేశ పడుతూ ఉంటాడు. అప్పుడే కావ్య కంగారుగా వచ్చి.. అక్కా ఏమైంది? అని అడుగుతుంది. ఏయ్ ఎక్కడికి వెళ్లావు? ఎందుకు వెళ్లావు? మా అమ్మని చూసుకుంటానని అన్నావు.. పక్కనే ఉండకుండా ఏమయ్యావు? మా అమ్మ ఏమై పోవాలి అనుకున్నావు? అని రాజ్ ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. రాజ్ ఇది ఆస్పత్రి రా.. ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. కావ్య అంత బాధ్యత లేని మనిషి అయితే కాదని సుభాష్ అంటాడు.
కావ్యపై శివాలెత్తిన రాజ్..
బాధ్యతా.. బాధ్యత తెలుసా? ఈ మనిషికి.. తెలిస్తే బాగోలేని మనిషిని వదిలేసి ఎక్కడికి వెళ్తుంది? మా అమ్మ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా? ఒక వేళ మా అమ్మకు ఏమన్నా జరగాలి.. చంపేస్తాను నిన్ను అని రాజ్ బీభత్సం సృష్టిస్తాడు. కావ్య చెబుతున్నా వినిపించుకోడు. ఇదంతా చూసి రుద్రాణి, రాహుల్‌లు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ లోపలి నుంచి బయటకు వస్తుంది. మా అమ్మకు ఏమైంది? ఎలా ఉంది? అని రాజ్ అడుగుతాడు. ఆవిడకు సడెన్‌గా బ్లడ్ ప్రెజర్ పెరిగి పోయింది. దాని వల్ల ఆవిడ కోమాలోకి వెళ్లింది. మెడిసిన్స్‌కి రెస్పాన్స్ అయితే అప్పుడు ఏమన్నా చెప్పగలమని డాక్టర్ చెబుతుంది.
సంతోషంలో రుద్రాణి, రాహుల్‌లు.. కంగారులో రాజ్..
స్టాపిట్ ఏం మాట్లాడుతున్నారా? మా అమ్మకు ఏమన్నా జబ్బు చేసిందా.. అదేం లేదు కదా.. పొద్దున్న బాగానే ఉంది కదా.. బాగానే మాట్లాడింది కదా.. మా అమ్మ బతకాలి అని రాజ్ ఆవేశంతో ఊగిపోతాడు. ఇక్కడ ఇంత మంది మాత్రం ఉండకూడదు. ఎవరో ఒకరు, ఇద్దరు మాత్రమే ఉండండి అని డాక్టర్ అంటుంది. మీరందరూ ఇక్కడ ఇంత మంది ఉండి ఏం చేస్తారు? వెళ్లండి.. మా అమ్మని మీరు ప్రాణాలతో బతికించాల్సిందే అని రాజ్ బాధ పడతాడు. అప్పుడే సుభాష్ ఆపుతాడు. ఏయ్ నువ్వు నా ఎదురుగా ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా నేనూ రాజ్ ఉంటాను. మీరందరూ వెళ్లమని సుభాష్ అంటాడు. నేను ఇక్కడే ఉంటానని కావ్య అంటే.. పెద్దావిడ, స్వప్న తీసుకెళ్తారు. అపర్ణకు బాలేదన్న విషయం తెలుసుకున్న కళ్యాణ్ కూడా ఆస్పత్రికి వెళ్తాడు. రాజ్‌కి, సుభాష్‌కి ధైర్యం చెబుతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..