Brahmamudi, September 2nd Episode: అపర్ణకు గుండె పోటు.. రుద్రాణి స్కెచ్‌తో జైలుకి రాజ్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని మోటివేట్ చేస్తుంది కావ్య. ప్రస్తుతం బ్రతకడానికి ఈ పని చేయడం మంచిదే. కానీ నచ్చినట్లు బతకడం కూడా ముఖ్యమే అని చెబుతుంది. స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్లాలి అని డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. కళ్యాణ్ ఇక నవ్వుతూ వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. హాలులో అపర్ణ, సుభాష్‌లు కూర్చొని ఉంటారు. అపర్ణ గుండె పట్టుకుంటూ ఉంటుంది. సుభాష్ పని చేసుకుంటూ ఉంటాడు. అపర్ణను గమనించి.. ఏంటి అపర్ణ ఏదన్నా ఇబ్బందిగా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని మోటివేట్ చేస్తుంది కావ్య. ప్రస్తుతం బ్రతకడానికి ఈ పని చేయడం మంచిదే. కానీ నచ్చినట్లు బతకడం కూడా ముఖ్యమే అని చెబుతుంది. స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్లాలి అని డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. కళ్యాణ్ ఇక నవ్వుతూ వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. హాలులో అపర్ణ, సుభాష్‌లు కూర్చొని ఉంటారు. అపర్ణ గుండె పట్టుకుంటూ ఉంటుంది. సుభాష్ పని చేసుకుంటూ ఉంటాడు. అపర్ణను గమనించి.. ఏంటి అపర్ణ ఏదన్నా ఇబ్బందిగా ఉందా? అని అడుగుతాడు. అపర్ణ చిరాకు పడుతూ ఏమీ లేదని అంటుంది. కాసేపటికి గుండె నొప్పి వచ్చి అక్కడే కూలబడిపోతుంది. వెంటనే డాక్టర్‌కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు సుభాష్. డాక్టర్ వచ్చి అపర్ణను పరీక్షిస్తాడు. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అని అడుగుతాడు. లేదని చెబుతుంది అపర్ణ.
అపర్ణకు గుండెపోటు.. డాక్టర్ వార్నింగ్..
ఆ తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. ఎలా ఉందని రాజ్ అడిగితే.. మీరంతా చదువుకున్న వారే కదా.. సరిగా చూసుకోవడం తెలీదా? ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారో లేదో చూడాలి కదా అని అంటాడు. దీంతో అందరూ కంగారు పడతారు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ట్యాబ్లెట్స్ ఇచ్చాను.. అవి ఇస్తూ ఉండండి. ఇప్పుడు తనకు బీపీ ఎక్కువగా ఉంది. మళ్లీ ప్రెషర్ ఎక్కువై.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆవిడను ఇప్పుడు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పి వెళ్తాడు. పేరుకే దుగ్గిరాల ఫ్యామిలీ.. ఇంట్లో ఇంత మంది ఉన్నా.. ఎవరూ పట్టించు కోవడం లేదు. ఏం కావ్యా నువ్వు కూడా మా వదినని చూసుకోవడం లేదా? ఎప్పుడూ నిన్ను వెనకేసుకొస్తుంది కదా మా వదిన. మరి నువ్వేం చేస్తున్నావ్? అని అంటుంది రుద్రాణి. అవకాశం దొరికింది కదా అని నా మనవరాలి మీద పడి ఏడుస్తున్నావ్ ఎందుకు? మరి నువ్వేం చేస్తున్నావ్? అని ఇందిరా దేవి అడుగుతుంది. మాటలతో తప్పించుకుంటుంది రుద్రాణి. ఎంతైనా రుద్రాణి గారు చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఇక నుంచి అత్తయ్య గారిని నేను చూసుకుంటానని కావ్య అంటుంది. ట్యాబ్లెట్స్ గురించి అన్ని వివరాలు చెప్పి వెళ్తాడు రాజ్.
కళ్యాణ్ మొదటి సంపాదన..
ఆ తర్వాత కళ్యాణ్ ఇంటికి వస్తాడు. ఏంటి కూచి ఇంత లేటు అయ్యిందని అప్పూ అడుగుతుంది. ముందు నువ్వు కళ్లు మూసుకో అని చెప్పి.. అప్పూ చేతిలో డబ్బులు పెడతాడు కళ్యాణ్. ఏంటి కవి ఇది అని అప్పూ అంటే.. మీ శ్రీవారి మొదటి సంపాదన అని కళ్యాణ్ అంటాడు. ఇంతకీ జాబ్ ఏంటని అప్పూ అడిగితే.. ఏముంది.. పికప్.. డ్రాప్ అని కళ్యాణ్ పొరపాటున అంటాడు. అంత ఫ్యామిలో పుట్టి.. నువ్వు డ్రైవర్‌గా చేయడం నాకు ఇష్టం లేదని అప్పూ అంటే.. కళ్యాణ్ మాట మార్చి కంపెనీలో చేస్తున్నానని అబద్ధం చెప్తాడు. అయినా అప్పూ ఫీల్ అవుతుంది. మంచి జాబ్ చూసుకుని వెళ్లొచ్చు కదా అని అంటుంది. సరేలే ఈ పని చేసుకుంటూ ఇంకొకటి చూసుకుంటానని చెప్తాడు.
ఎంట్రీ ఇచ్చిన పోలీసులు..
ఆ తర్వాత హాలులో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూర్చొంటారు. అప్పుడే ఇంటికి పోలీసులు వస్తారు. పోలీసులు రావడం చూసి అంతా షాక్ అవుతారు. ఏంటి ఎస్‌ఐ గారు మా ఇంటికి వచ్చారు? అని సుభాష్ అంటే.. ఇది ఎవరి ఇల్లో తెలుసుకున్నా రాలేక తప్పలేదు. ఉదయం మా పెట్రోలింగ్ వ్యాన్ వాళ్లు.. ఓ ట్రాలీ ఆటో పట్టుకున్నారు. అందులో దొంగ బంగారం సప్లై అవుతుంది. ఎంక్వైరీ చేస్తే అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కే సప్లై అవుతుందని బయట పడిందని పోలీస్ అంటాడు. మీరు ఏందో పొరబడి ఉంటారు. వంద సంవత్సరాలు చరిత్ర ఉన్న మా సంస్థ ఎప్పుడూ లేదు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అలాంటి పని మా వాళ్లు ఎవరూ చేయరు అని సీతారామయ్య అంటాడు. సారీ అన్నీ ఎంక్వైరీ చేసుకుని వచ్చాం. దీనికి బాధ్యులు అయిన వారిని అరెస్ట్ చేయక తప్పదు. కాబట్టి చైర్మన్ స్వరాజ్‌ని అరెస్ట్ చేస్తున్నామని చెబుతారు.
నిజం ఒప్పుకోమని రాహుల్‌ని నిలదీసిన సుభాష్..
పోలీసులు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. రాజ్ ఇప్పుడు కంపెనీ బాధ్యతలు చూసుకోవడం లేదు కదా.. కాబట్టి మా అబ్బాయికి ఎలాంటి సంబంధ లేదని అపర్ణ అంటుంది. ఏరా నువ్వేగా ఆఫీస్‌కి వెళ్లేది.. ఏం చేస్తున్నావ్? ఏం జరుగుతుంది? అని సుభాష్ నిలదీస్తాడు. ఇది మరీ బాగుంది.. నా కొడుకును తప్పు పడతారేంటి? అని రుద్రాణి అంటుంది. అయ్యయ్యో నేను ఈ మధ్యే కదా ఆఫీస్‌కి వెళ్తున్నా.. మన కంపెనీలో ఇలాంటి స్మగ్లింగ్ గోల్డ్ కొంటున్నారని నాకు ఎలా తెలుసు? అని రాహుల్ అంటాడు. నిజం చెప్పు.. ఎవరూ ఇలాంటి పనులు చేయరని సుభాష్ నిలదీస్తాడు. నా కొడుకుకు అలవాటు ఉందా? నా కొడుకుకు విశ్వాసం లేదా? అని రుద్రాణి అడుగుతుంది. ఆ తర్వాత ఒకరి తర్వాత అందరూ రుద్రాణి మీద పడతారు.
నేనే బాధ్యత వహిస్తా..
వాడిని అమాయకుడిని చేసి.. అడ్డమైన కేసుల్లో ఇరికిస్తే నేను ఊరుకుంటానా అని రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న కూడా రాహుల్‌పై అనుమానం ఉందని చెబుతుంది. చూశావా కట్టుకున్న భార్య మాత్రం అస్సలు నమ్మడం లేదు. మర్యాదగా చేసిన నేరం ఒప్పుకుంటే బాగుంటుందని పెద్దావిడ అంటుంది. ఎస్‌ఐ గారు మీరే అంతా చూస్తున్నారు కదా.. నేను కేవలం రెండు రోజుల ముందే ఆఫీస్‌కి వెళ్తున్నా. నాకేం తెలీదని అంటాడు రాహుల్. రాహుల్ కంగారు పడకు. నేనే బాధ్యత వహిస్తా.. పోలీసులకు కోపరేట్ చేస్తానని రాజ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.