Brahmamudi, September 20th Episode: దుగ్గిరాల ఇంటికి వచ్చిన కావ్య.. అనామికకు ఇచ్చిపడేసిన రౌడీ బేబీ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. రాజ్ తప్పుచేశాడని అంతరాత్మ నిందిస్తుంది. అయినా తన తప్పు లేదని వాదిస్తూ ఉంటాడు. నేను బతిమలాడి ఇంటికి రమ్మంటే.. నేను రాను పొమ్మని అంది. మరి నాకు మండదా.. ఎలాంటి మగవాడికి అయినా మండుతుంది. మరి రివర్స్ వార్నింగ్ ఇవ్వకుండా ఉంటే నాకు నిద్ర పడుతుందా.. అందుకే చెక్ తీసుకెళ్లి కిరాయి కోడలిగా రమ్మనాను. దీంతో నేనేదో కిరాయి మొగుడిని అయిపోయినట్టు మాట్లాడింది. అంత ఇగో, పొగరు దానికి అవసరమా? మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా..

Brahmamudi, September 20th Episode: దుగ్గిరాల ఇంటికి వచ్చిన కావ్య.. అనామికకు ఇచ్చిపడేసిన రౌడీ బేబీ..
BrahmamudiImage Credit source: disney hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Sep 20, 2024 | 1:15 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. రాజ్ తప్పుచేశాడని అంతరాత్మ నిందిస్తుంది. అయినా తన తప్పు లేదని వాదిస్తూ ఉంటాడు. నేను బతిమలాడి ఇంటికి రమ్మంటే.. నేను రాను పొమ్మని అంది. మరి నాకు మండదా.. ఎలాంటి మగవాడికి అయినా మండుతుంది. మరి రివర్స్ వార్నింగ్ ఇవ్వకుండా ఉంటే నాకు నిద్ర పడుతుందా.. అందుకే చెక్ తీసుకెళ్లి కిరాయి కోడలిగా రమ్మనాను. దీంతో నేనేదో కిరాయి మొగుడిని అయిపోయినట్టు మాట్లాడింది. అంత ఇగో, పొగరు దానికి అవసరమా? మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా.. అయినా పట్టించుకోకుండా వదిలేసి వెళ్లింది. సంస్థ పరువు కంటే.. మా అమ్మ ప్రాణం ముఖ్యమే కదా.. అందుకే కొంచెం ఎక్కువగా మాట్లాడాను. కానీ నేను నా అంతట నేను ఇంట్లోంచి వెళ్లిపొమ్మని నేను అనలేదని తనని తాను అనుకుంటాడు రాజ్.

రాజ్‌కు చివాట్లు పెట్టిన అంతరాత్మ..

కానీ రాజ్ మాటలు పట్టించుకోకుండా.. అంతరాత్మ సీరియస్‌గా చూస్తూ.. పట్టించుకోకుండా ఉంటుంది. మరి నేను వెళ్లి కళావతిని పిలిచాను కదా.. మరి రావలి కదా.. అని రాజ్ అంటూ ఉంటాడు. ఏరా.. అంటే అన్నానని గించుకుని చచ్చిపోతావు కానీ.. జీతం ఇస్తాను కోడలిగా నటిస్తావా అని అడుగుతావా.. అది ఎంత వరకు పోతుందో తెలుసా.. అంత బలుపు ఏంటిరా నీకు? అమ్మ అంటే ఇష్టమే నీకు ఒప్పుకుంటా.. సరే మీ అమ్మ ప్రకారమే వెళ్లావు.. వెళ్లినవాడివి.. అలాగేనా మాట్లాడేది.. అవసరం నీది.. మామూలుగా ఏడవచ్చుగా.. అంత ఇగో ఏంటిరా నీకు.. సంవత్సరం పాటు దాన్ని కాల్చుకుని తిన్నావు కదరా.. అని అంతరాత్మ తిడుతుంది. ఇలాంటి సలహాలు ఇవ్వకు కానీ వెళ్లు అని అంతరాత్మ తిడుతుంది. నేను నీ అంతరాత్మని కాకపోతే.. పీక పిసికి చంపేసేవాడిని. నువ్వు చచ్చేదాకా మారవు అని అంటుంది. ఇ క ఆ తర్వాత అంతరాత్మ వెళ్లిపోతుంది.

దుగ్గిరాల ఇంటికి వచ్చిన కావ్య..

ఆ తర్వాత కావ్య గదిలోని బెడ్ సర్దుతుంది. అప్పుడే వాళ్ల పెళ్లి ఫొటో కనిపించి చూస్తుంది. ఆ ఫొటో చూసి రాజ్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ బాధ పడుతుంది. అప్పుడే కనకం వెనుక నుంచి వచ్చి కావ్య అని పిలుస్తుంది. నాన్న వచ్చేశారా.. పదా భోజనం చేద్దామని కవర్ చేస్తుంది. ఇక తెల్లవారుతుంది. రాజ్ పడుకుని ఉండగా.. కావ్య కాఫీ తీసుకొచ్చి లేపుతుంది. ఇష్టం, ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారూ లేవండి అని కావ్య అంటుంది. ఏంటి నువ్వు వచ్చావా.. ఎలా వచ్చావు? అని రాజ్ అడిగితే.. షేర్ ఆటోలో వచ్చాను అని చెబుతుంది. అది కాదు.. ఓహో నిన్న నేను మాట్లాడిన మాటలకు భయ పడి.. బాధ పడి.. హడలిపోయి వచ్చావు అన్న మాట అని రాజ్ అంటే.. లేదు నా ఛార్జర్ మర్చిపోయాను. అలాగే తెగిన చెప్పులు రెండు ఉంటే.. అవి తీసుకెళ్లడానికి వచ్చానని అంటుంది.

ఇవి కూడా చదవండి

కళావతి వచ్చినట్టు కల కన్న రాజ్..

అంటే ఇక్కడ ఉండటానికి రాలేదా? అని రాజ్ అడుగుతాడు. మీతో కాపురం చేయడానికి ఏ ఆడదీ రాదని కావ్య అంటుంది. అసలు జీవితంలో గడప తొక్కని ఎవరు అన్నారో అని రాజ్ అంటే.. నేను ఎక్కడ వచ్చాను.. గడప దాటి వచ్చానని కావ్య అంటుంది. సరేలే ఎలాగో వచ్చావు కదా.. ఉండిపో అని రాజ్ అంటే.. ఎలా ఉండాలి? ఎందుకు ఉండాలి? ఏ రూపంలో ఉండాలి? అని కావ్య ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. నేను ఇక్కడ ఉండాలంటే మీరు బాండ్ పేపర్ మీద సంతకం చేయమని కావ్య అంటుంది. కట్ చేస్తే.. అదంతా రాజ్ కల కంటూ ఉంటాడు. పని మనిషి ఉంటుంది. కళావతి ఎక్కడ? రాలేదా అని రాజ్ అడుగుతాడు. మీరు కల కని ఉంటారని పనిమనిషి అంటుంది. కలా సరేలే ఆ కాఫీ ఇమ్మని రాజ్ అంటాడు. బాబుగారూ.. కావ్య అమ్మ లాంటి వారిని పంపించేశారు.. తీసుకురమ్మని అంటుంది. దీంతో రాజ్ గసురుతాడు. ఆ తర్వాత కాఫీ తాగితే.. చాలా చిరాకుగా ఉంటుంది.

అనామికకు ఇచ్చి పడేసిన అప్పూ..

కట్ చేస్తే.. కూరగాయలు కొంటూ వాటి రేట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పూ, కళ్యాణ్‌లు. అలా నడుస్తూ ఉంగా.. కారు ఆగుతుంది. అందులోనుంచి అనామిక, వేరే వ్యక్తి దిగుతారు. దుగ్గిరాల వారసుడు రోడ్డు మీద పడట్టు ఉన్నాడు. కారు కూడా లేనట్టుంది అని అంటుంది అనామిక. నీలాగా పరాయి వ్యక్తి కారులో తిరగడం లేదు. పరాయి వాళ్లు ఎవరు ఉన్నారు ఇక్కడ.. ఇతను నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి. సామంత్ జ్యూయలర్స్ అధినేత. త్వరలోనే దుగ్గిరాల కంపెనీని పడకొట్టి.. ఎదురులేని సంస్థగా సామంత్ కంపెనీ ఎదుగుతుంది. ఆ మాటలకు కళ్యాణ్‌ని చూసి నవ్వుతాడు. నేనేమీ రోడ్డు మీద పడలేదు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నానని కళ్యాణ్ అంటే.. దీన్నే రోడ్డున పడటం అంటారని అనామిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అంటాడు. దీన్ని రోడ్డున పడటం అనరు. రోడ్డున పడటం అంటే ఏంటో త్వరలోనే ఈ అనామిక తెలిసేలా చేస్తుంది. ఎందుకంటే దుగ్గిరాల కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం.. జ్యుయలరీ సంస్థ అధినేతనే పట్టిందంటే.. అది నీ మీద ప్రేమతో కాదు.. మా మీద ఉన్న పగతో.. కాబట్టి నిన్ను బకరాను చేసి వాడుకుంటుంది. ఆ తర్వాత దులిపేసుకుని పోతుంది. దీని బతుక్కి ఏం పేరు పెట్టాలో కూడా తెలీడం లేదని అప్పూ వార్నింగ్ ఇస్తుంది.

నాకు పట్టిన దరిద్రం ఎప్పుడో వదిలిపోయింది..

నాతో పాటు యువ రాజులా ఉండేవాడివి. దీన్ని చేసుకుని ఇఫ్పుడు అనామకుడిలా ఉన్నావని అనామిక అంటే.. నాకు పట్టిన దరిద్రం.. కోర్టులోనే వదిలిపోయింది. ఇప్పుడు నేను రాజులా నా భార్యతో కలిసి సంతోషంగా బతుకుతున్నా.. ఇప్పుడే నాకు స్వర్గంలా ఉందని కళ్యాణ్ అంటాడు. అవునా నాలుగు రోజులు అలాగే ఉంటుంది. నీకు ఎలాగో కవితలు రాయడం తప్ప ఎందుకూ పనికి రావు. ఇప్పుడు ఇది పిజ్జాలు, బర్గలు అమ్మి నిన్ను పోషిస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత సంపాదించడం చేతక రాని చవటను చేసుకున్నందుకు ఫీల్ అయి వదిలేసి వెళ్లిపోతుంది. జరిగేది ఇదే.. గుర్తు పెట్టుకో అని అనామిక అంటుంది. అనామిక ఇలాంటి వాడితో నీకు మాటలేంటి? పదా వెళ్దామని పెళ్లి చేసుకోబోయి వ్యక్తి అంటే.. సారీ బ్రదర్ నీకు సానుభూతి చూపించడం తప్ప ఇంకేం చేయలేను. ఇది నిన్ను ఫుల్లుగా వాడుకుని వదిలేస్తుంది. ఆ తర్వాత నువ్వు కూడా ఇలాగే రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. త్వరలోనే రోడ్డు మీద కలుసుకుందామని చెప్పి అప్పూ వెళ్లిపోతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!